Home » ఆ ఒక్క కార‌ణంతోనే పెళ్లికి దూర‌మైన నాగార్జున హీరోయిన్ ..అదేంటంటే…?

ఆ ఒక్క కార‌ణంతోనే పెళ్లికి దూర‌మైన నాగార్జున హీరోయిన్ ..అదేంటంటే…?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండే జంటలు చాలా తక్కువగా ఉంటాయి. కొంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకుంటే… మరికొందరు పూర్తిగా పెళ్ళికి దూరంగా ఉంటూ జీవితాన్ని గడిపేస్తారు. కేవలం హీరోలే కాకుండా ఒకప్పటి హీరోయిన్ లు సైతం పెళ్లికి దూరంగా ఉండి సింగిల్ గా జీవితాన్ని గడుపుతున్నారు. ఆ లిస్టులో ఒకప్పటి టాప్ హీరోయిన్ సుస్మితాసేన్ కూడా ఒకరు. సుస్మిత సేన్ 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. అమితాబచ్చన్ సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల పక్కన సినిమాలు చేశారు. ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లోనూ సుస్మితాసేన్ సినిమాలు చేశారు. టాలీవుడ్ లో నాగార్జున హీరోగా నటించిన రక్షకుడు సినిమాలో ఆయనకు జోడిగా నటించారు. అంతేకాకుండా జేడీ చక్రవర్తి హీరోగా నటించిన హర్రర్ సినిమా మరి చెట్టులో కూడా అతడికి జోడిగా నటించారు.

Advertisement

ఇక చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సుస్మితాసేన్ రీసెంట్ గా ఆర్య అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా సుస్మిత‌ సేన్ ఓ టీవీ షో లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడుసార్లు పెళ్లి వరకు వెళ్లినా తాను ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సి వచ్చిందో చెప్పారు. సుస్మిత సేన్ మాట్లాడుతూ…. అదృష్టవశాత్తు నేను చాలా ఆసక్తికరమైన మనుషులను కలుసుకున్నాను.

 

నేను ఇంతవరకు పెళ్లి చేసుకోక పోవడానికి వాళ్లు నిరాశ చెందడమే కారణం. దీనికి నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు. నా పిల్లలతో నాకు ఎప్పుడూ మంచి సన్నిహిత్యమే ఉండేది. నా జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని నా పిల్లలు అంగీకరించారు. ప్రతి ఒక్కరికి సమానమైన ప్రేమ గౌరవాన్ని అందించారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను నిజానికి సుమారు మూడుసార్లు పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. మూడుసార్లు కూడా వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లాను. కానీ దేవుడు నన్ను రక్షించాడు. వారి జీవితంలో జరిగిన విషయాలను నేను మీకు చెప్పలేను. దేవుడు నన్ను నా పిల్లలను కాపాడుతున్నాడు. దేవుడు మనల్ని చెడు బంధంలోకి వెళ్ళనివ్వడు అంటూ సుస్మితాసేన్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ALSO READ :ప‌విత్ర లోకేష్ భ‌ర్త సుచేంద్ర‌ప్ర‌సాద్ బ్యాక్ గ్రౌండ్ గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading