Home » IPL 2023 : SRH ప్లేయర్లకు క్లాస్ పీకిన మహేందర్ సింగ్ ధోని

IPL 2023 : SRH ప్లేయర్లకు క్లాస్ పీకిన మహేందర్ సింగ్ ధోని

by Bunty
Ad

 

ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నై టీం ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో రెండు ఆసక్తికర విషయాలు జరిగాయి. ఈ రెండు విషయాల్లో హీరో ధోని అనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో ధోని తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు.

READ ALSO : Ugram Trailer : ‘ఉగ్రం’ ట్రైలర్ విడుదల… నరేష్ ఉగ్రరూపం

Advertisement

అద్భుతమైన స్టంపింగ్ తో పాటుగా అంతే అద్భుతమైన కీపింగ్ స్కిల్స్ ను మరోసారి ప్రపంచానికి చూపించాడు. జడేజా బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్ ను స్టన్నింగ్ స్టంపౌట్ చేశారు. ఇక ఇదే మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ను అద్భుతమైన త్రోతో పెవిలియన్ కు పంపాడు. ధోని ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం సీఎస్కే కెప్టెన్ ధోనిని ఎస్ఆర్హెచ్ యువ ఆటగాలను కలిశారు.

Advertisement

read also : Nayanatara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార రిలేషన్ షిప్ !

MS Dhoni Interacts With Sunrisers Hyderabad Players After CSK vs SRH IPL 2023 Match, Pictures Go Viral! | 🏏 LatestLY

ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ వర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను శ్రద్ధగా వినడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ ఆడుతున్నంత సేపే ధోని అవతలి జట్టు ఆటగాళ్లను ప్రత్యార్థిగా చూస్తాడు. ఒకసారి మ్యాచ్ ముగిసింది అంటే ధోని ప్రత్యర్థి జట్టుతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాడు. గతంలోనూ ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడం చూసాం. తాజాగా ఎస్ ఆర్ హెచ్ ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

read also : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Visitors Are Also Reading