Home » సన్ రైజర్స్ కు మరో దెబ్బ..!

సన్ రైజర్స్ కు మరో దెబ్బ..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో మొదటి రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకపోతుంది. బ్యాటర్లు పర్వాలేదు అనిపిస్తున్న బౌలర్లు దుమ్ము లేపుతున్నారు. అయితే హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ ఎప్పుడు బలంగానే ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సీజన్ లో కూడా తమ ప్రదర్శనతో అది నిజం అని నిరూపిస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు.

Advertisement

అయితే ఈ ఐపీఎల్ కోసం 8 కోట్లకు పైగా చెల్లించి తీసుకున్న వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో జట్టులో స్పిన్నర్లు కరువయ్యారు. కానీ ఆ తర్వాత అతని స్థానంలో జట్టులో సుచిత్ వచ్చాడు. గత మ్యాచ్ లో బెంగళూర్ పై సుచిత్ చెలరేగిపోవడంతో అతని పై ఆశలు ఏర్పడాయి. కానీ తాజా సమాచారం ప్రకారం సుచిత్ కూడా గాయంపాలైనట్లు తెలుస్తుంది. అందువల్ల తదుపరి మ్యాచ్ కు అతను అందుబాటులో ఉండటం లేదు.

Advertisement

కాబట్టి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షాన్ కోసం కెప్టెన్ కేన్ మామనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. తర్వాతి మ్యాచ్ లో కనీసం ఒక్క ఓవర్ అయిన వేయాల్సి వస్తుంది అనే ఆలోచనతో కేన్ మామ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒక్కటి సన్ రైజర్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక బ్యాటింగ్ లో తడబడుతున్న కేన్ మరి బౌలింగ్ లో ఏం చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ విజయంకు వారే కారణం : తండ్రి అబ్దుల్ రషీద్

ఇషాన్ భయపడుతున్నాడు.. ఇలా అయితే కష్టం..!

Visitors Are Also Reading