Home » శ్రీయ ప్రెగ్నెన్సీ మ్యాటర్ అందుకే సీక్రెట్ గా ఉంచిందా…?

శ్రీయ ప్రెగ్నెన్సీ మ్యాటర్ అందుకే సీక్రెట్ గా ఉంచిందా…?

by AJAY
Ad

తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లుగా రాణించిన వారిలో శ్రీయ కూడా ఒకరు. శ్రీయ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో సైతం సినిమాలు చేసింది. అయితే తెలుగు హీరోయిన్ గానే శ్రీయకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. శ్రీయ దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం కేవలం హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ శ్రీయ సినిమాల్లో నటిస్తోంది.

Advertisement

ఇదిలా ఉంటే శ్రీయ కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే విదేశీయుడు అయిన ఆండ్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా శ్రీయ 2021లో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శ్రీయ ప్రెగ్నెన్సీ విషయం మొదట అసలు బయటకు రాలేదు. శ్రీయ కూడా తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ఫోటోలను కానీ ప్రెగ్నెన్సీ విషయాన్ని గాని బయట పెట్టలేదు.

Advertisement

ఇక ఒక్కసారి గా తమకు సంతానం కలిగింది అంటూ ఫోటోను షేర్ చేయడంతో అందరూ అవాక్కయ్యారు. శ్రీయ సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిందా…? అని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత తాను ప్రెగ్నెంట్ గా ఉన్న ఫోటోలను కూడా శ్రీయ షేర్ చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీయ తాను ఎందుకు ప్రెగ్నెన్సీ విషయాన్ని బయట పెట్టలేదో వెల్లడించింది. తన కూతురు రాధ కడుపులో ఉన్న సమయంలో అందమైన క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా గడపాలని అనుకున్నట్టు చెప్పింది.

ఆ సమయంలో ఎవరైనా లావు అవుతారు…. అయితే హీరోయిన్స్ లావు అవ్వడాన్ని సాధారణంగా చూడలేరు. లావు అవ్వడం చింతించాల్సిన విషయం…. కాబట్టి ఆ ఫోటోలను షేర్ చేయలేదు. అభిమానులకు ప్రెగ్నెన్సీ విషయం తెలిస్తే వాళ్లు బాడీ షేప్ పై ట్రోల్స్ చేస్తారు. అంతేకాకుండా నా బిడ్డ పై దృష్టి పెడతారు. అందువల్లే ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటకు రానివ్వలేదు. అంటూ శ్రీయ వెల్లడించింది. ఇక ప్రస్తుతం శ్రీయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Visitors Are Also Reading