Home » నెట్టింట‌ వైర‌ల్ అవుతున్న శ్రీదేవి చివ‌రి ఫోటో చూశారా..?

నెట్టింట‌ వైర‌ల్ అవుతున్న శ్రీదేవి చివ‌రి ఫోటో చూశారా..?

by AJAY
Ad

అందాలతార అతిలోక సుంద‌రి శ్రీదేవి అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌స్తుతం శ్రీదేవి ఈలోకంలో లేక‌పోయినా ఆమె న‌టించిన సినిమాల ద్వారా చేసిన పాత్ర‌ల ద్వారా ప్రేక్ష‌కుల హృద‌యాల‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగునేల పై పుట్టిన శ్రీదేవి బాలీవుడ్ ను సైతం షేక్ చేసింది. అందం అభిన‌యం న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. ఎన్టీఆర్ లాంటి స్టార్స్ నుండి చిరంజీవి లాంటి స్టార్స్ వ‌ర‌కూ రెండు త‌రాల హీరోల‌తో హీరోయిన్ గా సినిమాలు చేసి అల‌రించింది.

Sridevi Photos

Sridevi Photos

ఇక శ్రీదేవి ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ నిర్మాత బోణీక‌పూర్ ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శ్రీదేవి బోణీక‌పూర్ దంప‌త‌లకు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. పెద్ద‌కూతురు జాహ్న‌వి క‌పూర్ ఇప్ప‌టికే త‌న అందాల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతే కాకుండా త్వ‌ర‌లోనే టాలీవుడ్ లోనూ అడుగుపెట్ట‌బోతుంది అంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే శ్రీదేవి 2018 ఫిబ్ర‌వ‌రి 18న గుండె పోటుతో బాత్రూం లోనే క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కాగా బోణీక‌పూర్ త‌న భార్య‌ శ్రీదేవి వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆమె చివ‌ర‌గా దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలో శ్రీదేవి బంధువ‌ల మ‌ధ్య‌న ఉంది. అందంగా ప‌ట్టుచీర‌లో మెరిసిపోతోంది. ఇక ఈ ఫోటో వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్ లు అభిమానులు ఎమోష‌నల్ అవుతున్నారు.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చదవండి !

Visitors Are Also Reading