Home » Sr:ఎన్టీఆర్ మూవీలో కూడా మేకప్ లేకుండా నటించిన స్టార్ హీరోయిన్..!!

Sr:ఎన్టీఆర్ మూవీలో కూడా మేకప్ లేకుండా నటించిన స్టార్ హీరోయిన్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీని అగ్రస్థానంలో నిలబెట్టిన నటుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నందమూరి తారక రామారావు. ఇండస్ట్రీని పై స్థాయిలో నిలబెట్టడమే కాకుండా, రాజకీయాలను కూడా శాసించిన మహానుభావుడు. అలాంటి అన్న ఎన్టీఆర్ సినిమా అంటే ఏ హీరోయిన్ కు అయినా భయంతో పాటు చాలా క్రేజ్ ఉండేది. అలాంటి ఎన్టీఆర్ సినిమాలో మేకప్ లేకుండా నటించిన నటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రోజుల్లో ఎంత అందంగా ఉన్నా సరే సినిమాలో మేకప్ అనేది ఉండాల్సిందే. అవసరమైతే విగ్గు కూడా ధరించాలి.

Advertisement

also read:దర్శకేంద్రుడికి తీరని 3 కోరికలు..!

హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా విగ్గులు ఉంటాయి. కానీ ఆ హీరోయిన్ మాత్రం మేకప్ లేకుండానే చిత్రాలు చేసేవారు. ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా సరే మేకప్ వేసుకునేవారు కాదు. ఆమె ఎవరో కాదు అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన కన్నాంబ. తొలితరం హీరోయిన్ గా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి సినిమాల్లో కీలకపాత్రలు చేశారు. ఆ తర్వాత తనను జనం హీరోయిన్ గా చూడారని భావించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.

Advertisement

ఎన్టీఆర్ అక్కినేని సినిమాల్లో ఆమె అమ్మ, వదిన అత్త, పాత్రను సమర్ధంగా పోషించేవారు. కొన్ని సందర్భాలలో షూటింగ్ కూడా ఆమె ఆలస్యంగా వచ్చేవారు. ఈ తరుణంలో ఆమె కొన్ని కొన్ని చిత్రాలు డైరెక్ట్ గా షూటింగ్ కి వెళ్లి పాల్గొనేవారు. డైలాగ్ షీట్ చూసి సందర్భాన్ని తెలుసుకొని తానే సొంతంగా డైలాగులు కూడా చెప్పేవారు. రచయితలు చెప్పిన దానికంటే ఆమె మాటలు ఇంకా బాగుండేవని అంటుంటారు. ఎన్టీఆర్ సినిమాలో కూడా ఈ హీరోయిన్ మేకప్ లేకుండానే నటించారట. మేకప్ ఎందుకు వేసుకోలేదని ఎన్టీఆర్ దర్శకుడిని అడిగితే చందమామకు మేకప్ ఎందుకని ఆయన అనేవారట.

also read:

Visitors Are Also Reading