Telugu News » Blog » SR.NTR ఆ హీరోయిన్ ని మాత్రమే అమ్మా అని పిలిచేవారట..ఎవరంటే..?

SR.NTR ఆ హీరోయిన్ ని మాత్రమే అమ్మా అని పిలిచేవారట..ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ ఎంతటి చరిత్ర కలిగిన నటుడో మనందరికీ తెలుసు. ఆయన సినిమా విషయంలో ఎంత డెడికేషన్ తో ఉంటారో , నటీనటులతో కూడా చాలా అనుబంధాలను ఏర్పరచుకున్నారట. తనకు నచ్చితే ఎలాంటి వారినైనా తనతో పాటు ఎంతవరకైనా తీసుకెళ్లే వారట. ఒకవేళ నచ్చకుంటే మాత్రం అసలు దగ్గరకు రానిచ్చేవారు కాదని అంటుంటారు.

ALSO READ;కళ్యాణ్ రామ్ లో ఉన్న ఆ గొప్ప లక్షణం వల్లే డైరెక్టర్లు స్టార్స్ అయ్యారా..?

అలాంటి సీనియర్ ఎన్టీఆర్ తను చనిపోయే వరకు ఇదే విధానాన్ని కొనసాగించారు. అయితే ఆయనకు నచ్చిన వారిలో చాలామందిని వరుసలు పెట్టుకొని మరీ పిలిచేవారట. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిత్తూరు నాగయ్య. మొదటి తరం హీరో అయిన నాగయ్యను ఎన్టీఆర్ గురువుగా భావించేవారు. అంతేకాకుండా ఆయనను నాన్నగారు అని పిలిచేవారట. అంతేకాకుండా మరో నటి గయ్యాళి అత్త పాత్రలో నటించే సూర్యకాంతమును ముద్దుగా అత్తా అని పిలిచేవారట, ఆమె మరణించే వరకు సూర్యకాంతమును అత్త అనేవారని అంటుంటారు.

Advertisement

అలాగే ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో నటించిన సావిత్రిని కూడా సావిత్రమ్మ అంటూ ఒక చెల్లి లాగా చూసుకునేవారట ఎన్టీఆర్. ఇక ఒక్క నటిని మాత్రం కడుపారా అమ్మ అని పిలిచేవారట ఎన్టీఆర్. ఇంతకీ ఆవిడ ఎవరో కాదు పుండరీ బాయ్. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి రావడానికి ముందే ఆమె తొలి తరం హీరోయిన్ గా ఆ తర్వాత ఎన్టీఆర్ కు తల్లిగా 30 సినిమాల్లో కనిపించారట పుండరీ బాయ్. నిండుగా చీర కట్టుకొని ఎవరు చూసినా చేతులెత్తి నమస్కరించి అమ్మ అని పిలవాలనిపించే నిండుతనం ఉండేదట. ఆ విధంగా ఎన్టీఆర్ కూడా సొంత అమ్మలాగా మనస్ఫూర్తిగా అమ్మ అని సంభోదించే వారని సమాచారం.

ALSO READ;రోబో సినిమా కాన్సెప్ట్ ను శంక‌ర్ మ‌న తెలుగు సినిమా నుండి కాపీ కొట్టాడా..? ఆ సినిమా ఏదంటే.?

You may also like