Home » కళ్యాణ్ రామ్ లో ఉన్న ఆ గొప్ప లక్షణం వల్లే డైరెక్టర్లు స్టార్స్ అయ్యారా..?

కళ్యాణ్ రామ్ లో ఉన్న ఆ గొప్ప లక్షణం వల్లే డైరెక్టర్లు స్టార్స్ అయ్యారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అందులో బాలకృష్ణ తర్వాత హీరోలుగా నిలదొక్కుకున్నవారు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ మాత్రమే. నందమూరి ఫ్యామిలీలో ఎంతో గొప్ప మనసు ఉన్నటువంటి హీరోలలో కళ్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటారు. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. ఆయన చేసిన సినిమాల్లో కొన్ని హిట్ అవ్వగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి.

Advertisement

also read;రోబో సినిమా కాన్సెప్ట్ ను శంక‌ర్ మ‌న తెలుగు సినిమా నుండి కాపీ కొట్టాడా..? ఆ సినిమా ఏదంటే.?

అయితే కళ్యాణ్ రామ్ లో ఉన్న గొప్ప లక్షణం ఏంటయ్యా అంటే.. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నా కానీ కొత్త డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఇచ్చే గొప్ప మనసున్న హీరో. ఆ డైరెక్టర్లలో కొంతమంది కళ్యాణ్ రామ్ కు సక్సెస్ ని కూడా అందించారు. కళ్యాణ్ రామ్ చిత్రాలతోనే కెరియర్ ను మొదలుపెట్టిన సురేందర్ రెడ్డి , అనిల్ రావిపూడి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారో మనందరికీ తెలుసు. నందమూరి హీరోలతో సినిమాలు మొదలుపెట్టిన వీరికి లక్కు కలిసి వచ్చింది.

Advertisement

అయితే చాలా సందర్భాల్లో ఈ కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి వారు చెప్పిన కథ నచ్చితే మాత్రం నిర్మాతగా కళ్యాణ్ రామే వ్యవహరించేవారు. ఈ విధంగా కొత్తవారికి ఇండస్ట్రీలో ఛాన్సులు ఇచ్చిన గొప్ప లక్షణం కలిగిన నందమూరి హీరో అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో భారీ అంచనాల మధ్య వచ్చిన బింబిసారా మూవీ సక్సెస్ అందుకుంది. దీని తర్వాత చాలామంది నిర్మాతలు కళ్యాణ్ రామ్ తో ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది .

also read;యాంక‌ర్ అనితా చౌద‌రికి బాల‌య్య అంత‌పెద్ద సాయం చేశారా..? ఏం చేశారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Visitors Are Also Reading