Home » రోబో సినిమా కాన్సెప్ట్ ను శంక‌ర్ మ‌న తెలుగు సినిమా నుండి కాపీ కొట్టాడా..? ఆ సినిమా ఏదంటే.?

రోబో సినిమా కాన్సెప్ట్ ను శంక‌ర్ మ‌న తెలుగు సినిమా నుండి కాపీ కొట్టాడా..? ఆ సినిమా ఏదంటే.?

by AJAY
Ad

ఇండియాలోని టాప్ డైరెక్ట‌ర్ ల‌లో ఒక‌రు శంక‌ర్. ప్ర‌స్తుతం శంక‌ర్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కిస్తున్నారు. ఇక శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గొప్ప సినిమాల‌లో రోబో కూడా ఒక‌టి. ఈ సినిమా శంక‌ర్ ప్ర‌తిభ ను ఇండియాకు చూపించింది. ఈ సినిమాలో ర‌జినీకాంత్ హీరోగా న‌టించ‌గా ఐశ్వ‌ర్య‌రాయ్ హీరోయిన్ గా న‌టించింది.

Advertisement

ఈ చిత్రంలోగ్రాఫిక్స్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అంతే కాకుండా ఈ సినిమాలో రోబో ఐశ్వ‌ర్య‌రాయ్ తో ప్రేమ‌లో ప‌డుతుంది. ఈ కాన్సెప్ట్ ప్రేక్ష‌కుల‌కు చాలా కొత్త‌గా అనిపించింది. ఈ చిత్రం జ‌పాన్ లో కూడా ఆద‌ర‌ణ పొందింది. అయితే నిజానికి ఇదే కాన్సెప్ట్ తో తెలుగులో నైన్టీస్ లోనే ఓ సినిమా వ‌చ్చింది.

Advertisement

ఆలీ రోజా హీరోహీరోయిన్ లుగా న‌టించిన గ‌టోత్క‌చుడు సినిమా అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించింద‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఘ‌టోత్క‌చుడు భూమిపైకి రావ‌డం అనే డిఫ‌రెంట్ పాయింట్ తో ఎస్వీ కృష్ణారెడ్డి క‌థ‌ను రాసుకున్నాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రాజ‌శేఖ‌ర్ లు సైతం ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టించారు.

ఈ సినిమా మంచి విజ‌యం సాధిచింది. అంతే కాకుండా ఈ సినిమా అప్ప‌ట్లో మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన రోజా వెంట ఓ రోబో ప‌డుతుంది. అంతే కాకుండా రోబో రోజాను ప్రేమిస్తున్నా అంటూ వెంట‌ప‌డ‌టం అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌కు చాలా కొత్త‌గా అనిపించింది. ఇక ఇదే కాన్సె ప్ట్ తో సినిమా చేసి శంక‌ర్ రికార్డులు క్రియేట్ చేశాడు.

Visitors Are Also Reading