సింగర్ గా, సంగీత దర్శకుడిగా ఎందరో హృదయాల్లో నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి పరిచయం అవసరం లేదు. ఆయన కుమారుడు చరణ్ కూడా ప్రస్తుతం ఆయన అడుగుజాడల్లో గాయకుడిగా నడుస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం తరువాత అటువంటి గాయకుడు మరొకరు లేరు అన్నంతగా ఆయన ఎదిగారు. ఆయనకు పాట అంటే పంచ ప్రాణాలు. అందుకే ఆయన తన పిల్లలకు కూడా చరణ్, పల్లవి అని పేర్లు పెట్టుకున్నారు.
Advertisement
పేర్లకు తగ్గట్లే వీరిద్దరూ కూడా మంచి గాయకులు. చరణ్ పాటలు పడతారు అన్న సంగతి చాలా మందికి తెల్సు. కానీ, పల్లవి కూడా పాటలు పాడుతుందని ఎవరికీ తెలియదు. ఆమె చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. తండ్రి అంత పెద్ద సింగర్ అయినా.. ఆయన పేరు చెప్పుకుని అవకాశాలు తీసుకోవాలని ఆమె చూడరు. స్వతహాగా టాలెంట్ ఆమె సొంతం. తన సొంతంగా సంపాదించుకున్న అవకాశాల్లోనే ఆమె తనను తానూ నిరూపించుకున్నారు.
Advertisement
ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించిన జీన్స్ సినిమాలో “హాయిర హాయిర హాయిరబ్బా అనే పాట ని పల్లవి ఆలపించారు. ఇదే కాకుండా ప్రేమికుడు సినిమాలో అందమైన ప్రేమ రాణి పాటని కూడా పల్లవి పాడారు. ఈ రెండు సాంగ్స్ ఎంత హిట్ అయ్యాయో మనకి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె ఓ డజన్ సాంగ్స్ వరకు పాడారు. అయితే.. తండ్రి పేరు చెప్పుకుని అవకాశాల కోసం చూడకపోవడం, లో ప్రొఫైల్ మైంటైన్ చేయడం వల్లే ఆమె గురించి చాలా మందికి తెలియదు.
మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్
ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం
టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్