Home » ఎస్పీ బాలు లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు.. ఆ ఒక్క కారణంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారా..?

ఎస్పీ బాలు లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు.. ఆ ఒక్క కారణంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో తన పాటలతో ఎన్నో రికార్డులు సృష్టించారు ఎస్పీ బాలు. అప్పట్లో ఏ సినిమా వచ్చిన ఆయన గాత్రం లేనిది పాటలు ఉండేవి కావు.. ఎంతో చక్కనైన వాయిస్ తో పాటలు పాడి ఎంతోమందిని మైమరిపించారు ఎస్పీ బాలు.. అలాంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి నిజ జీవితానికి సంబంధించిన లవ్ స్టోరీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. మనం ఎక్కువగా సినిమాల్లోనే ప్రేమ కథలు చూస్తూ ఉంటాం కానీ నిజజీవితంలో కూడా సెలబ్రిటీల జీవితాల్లో అనేక ట్విస్ట్ లతో కూడిన ప్రేమ కథలు ఉన్నాయి.. అలాంటి ప్రేమ కథ ఎస్పీ బాలు గారిది..

Advertisement

ALSO READ:ముస్లిం వ్యక్తితో పెళ్ళి, అసలు పేరు మార్చుకున్న ఇంద్రజ…? జబర్దస్త్ జడ్జి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు…!

బాలు శ్రీమతి పేరు సావిత్రి. వీరి పెళ్లి కాకముందే దగ్గరి బంధువులు. ఒక సందర్భంలో మనసు మనసు కలిసి ప్రేమలో పడ్డారు. ఒకే కులం అయినా పెద్దలు ఒప్పుకోలేదట. కారణం ఇద్దరిదీ ఒకటే గోత్రం. పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక ఇద్దరి మధ్య దూరం పెంచడం కోసం సావిత్రిని వారి తల్లిదండ్రులు మద్రాసు నుంచి బెంగళూరు పంపించేశారు. కానీ బాలసుబ్రహ్మణ్యం మాత్రం ఎలాగైనా ఆవిడని దక్కించుకోవాలని, దానికి తగ్గట్టుగానే ప్లాన్ వేసి, ఒక ఫ్రెండ్ కార్ తీసుకొని బెంగళూరు వెళ్లారు. ముందే సమాచారం ఇవ్వడంతో సావిత్రి కాంపౌండ్ బయట వెయిట్ చేస్తూ ఉంది.

Advertisement

ఇక అక్కడి నుంచి ఆమెను తీసుకొని మద్రాసు వెళ్లిపోయారు బాలు.ఆ తర్వాత వీరు విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సింహాచలం చేరుకొని నరసింహ స్వామి సమక్షంలో తన స్నేహితుల సహాయంతో సావిత్రి మెడలో మూడుముళ్లు వేశారు ఎస్పీ బాలు. మూడు రోజుల తర్వాత ఇద్దరూ తిరిగి మద్రాసు వచ్చి ఒక హోటల్లో మకాం వేశారు. పాటల రికార్డింగ్ కోసం బాలు అక్కడి నుంచి వెళ్ళి వస్తుండేవారు. ఇక మొదటి సంతానంగా పల్లవి పుట్టిన తర్వాత సావిత్రి తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి వారి కుటుంబంతో కలిసి హ్యాపీగా జీవించారు. అలాంటి ఎస్పీ బాలు ఇండస్ట్రీకి దూరమవడం బాధాకరమైన విషయం.

ALSO READ:డ్యామిట్ కథ అడ్డం తిరిగింది ! భర్తకి ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య ఘటనలో ఊహించని ట్విస్ట్ !

Visitors Are Also Reading