Home » ముస్లిం వ్యక్తితో పెళ్ళి, అసలు పేరు మార్చుకున్న ఇంద్రజ…? జబర్దస్త్ జడ్జి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు…!

ముస్లిం వ్యక్తితో పెళ్ళి, అసలు పేరు మార్చుకున్న ఇంద్రజ…? జబర్దస్త్ జడ్జి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు…!

by AJAY
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో నటి ఇంద్రజ కూడా ఒకరు. ప్రస్తుతం ఇంద్రజ జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రోజా జబర్దస్త్ కు దూరం అవ్వడంతో ఆస్థానంలోకి ఇంద్రజ వచ్చారు. తన అందంతో పంచ్ లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఒకప్పుడు ఇంద్రజ బాలకృష్ణ,మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించి మెప్పించింది.

 

అంతేకాకుండా కమెడియన్ ఆలీతోనూ ఇంద్రజ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా రాణించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంద్రజ పలు టీవీ షోలో బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో మల్లె మాల వారి టీవీ షోలలో కనిపిస్తోంది.

Advertisement

Advertisement

జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తూ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంది. ఇంద్రజ నేరుగా జబర్దస్త్ లో జడ్జిగా ఇంటర్వ్యూ ఇవ్వకుండా కొద్దిరోజులపాటు రోజాకు అనారోగ్యం కలగడం వల్ల టెంపరరీగా వచ్చారు. ఆ సమయంలో ప్రేక్షకులు ఇంద్రజను పర్మినెంట్ జడ్జి కావాలని కోరుకున్నారు. ఇక రోజా జబర్దస్త్ గుడ్ బై చెప్పిన తర్వాత ఇంద్రజ పర్మినెంట్ జడ్జిగా మరోసారి ఎంట్రీ ఇచ్చారు. తెలుగువారికి ఎంతో సుపరిచితురాలు అయినా… ఇంద్రజ గురించి ఎవరికి తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం….. ఇంద్రజ చెన్నైలో జన్మించారు. ఆమె అసలు పేరు ఇంద్రజ కాదు అసలు పేరు రజతి.

కేవలం సినిమాల కోసమే తన పేరును ఇంద్రజగా మార్చుకున్నారు. మొదట తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా ఇంత హీరోయిన్ గా పరిచయమయ్యారు. 15 ఏళ్ల వయసులోనే ఇంద్రజ సినిమాల్లో అడుగుపెట్టారు. అంతేకాకుండా ఇంద్రజ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం తన భర్త పిల్లలతో కలిసి హ్యాపీగా గడుపుతూనే టివి షోలలో సందడి చేస్తున్నారు.

Visitors Are Also Reading