Home » SRH కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్‌ప్లేయర్ ?

SRH కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్‌ప్లేయర్ ?

by Bunty
Ad

దక్షిణాఫ్రికా విధ్వంసకర వీరుడు హేన్రిచ్ క్లాసెన్ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. కెరీర్లో కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడిన హేన్రిచ్ క్లాసెన్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఇటీవల టీం ఇండియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ తో హేన్రిచ్ క్లాసెన్ బదులు కైలి వేర్నిని ఆడించారు. దాంతో సుదీర్ఘ ఫార్మాట్ ఇక అతనికి వర్కౌట్ కాదని అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డీల్ యెల్గర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌత్ ఆఫ్రికా రెండో సీనియర్ ప్లేయర్ గా నిలిచాడు.

Advertisement

హేన్రిచ్ క్లాసెన్ 2017 ఫిబ్రవరిలో న్యూజిలాండ్ లో జరిగిన టెస్ట్ సిరీస్లో సౌత్ ఆఫ్రికా జట్టుకు హేన్రిచ్ క్లాసెన్ ఎంపికయ్యాడు. కానీ ఆ సిరీస్ ఆడలేకపోయాడు. దాంతో 2019లో భారత పర్యటనలో హేన్రిచ్ క్లాసెన్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. రాంచీలో జరిగిన మ్యాచ్ అనంతరం రెండో మ్యాచ్ కోసం అతడు నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2023లో హేన్రిచ్ క్లాసెన్ వెస్టిండీస్ తో సిడ్నీ, సెంచూరియాన్ , జోహాన్నెస్ బర్గ్ లో రెడ్ బాల్ క్రికెట్ ఆడాడు. మొత్తం నాలుగు మ్యాచుల్లో 104 రన్స్ కొట్టాడు అంతే. అయితే వైట్ బాల్ క్రికెట్ లో హేన్రిచ్ క్లాసెన్ చాలా ప్రమాదకరమైన బ్యాటర్. వన్డేల్లో, టీ20ల్లో క్లాసెన్ ట్రాక్ రికార్డ్ అద్భుతం.

బంతిని బలంగా కొట్టే ఈ హిట్టర్ కు పొట్టి ఫార్మాట్లో 172.71 వన్డేల్లో 140.66 స్ట్రైక్ రేటు ఉంది. 2023లో బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో హేన్రిచ్ క్లాసెన్ దక్షిణాఫ్రికా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. హేన్రిచ్ క్లాసెన్ గత ఏడాది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ తరపున విద్వాంసకర ఇన్నింగ్స్ లో ఆడాడు. టెస్ట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హేన్రిచ్ క్లాసెన్ తన భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading