Home » IPL 2023 : చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

IPL 2023 : చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

by Bunty
Ad

IPL 2023 టోర్నీ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని ఢిల్లీ కాపిటల్స్ అలవోగా చేదించింది. 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ 187 పరుగులు చేసింది.

READ ALSO : Rakul Preet Singh : బికినీలో మంచునే కలిగిస్తున్న రకుల్ ప్రీత్… వీడియో వైరల్

Advertisement

Image

20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆర్సిబి 181 పరుగులు చేసింది. ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 50వ మ్యాచ్ జరిగింది. ఇక ఆటు ఢిల్లీ, బెంగళూరు మ్యాచ్ అనంతరం ఎప్పుడు సీరియస్ గా ఉండే కోహ్లీ గంగూలి సరదాగా చేతులు కలుపుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కలిసిపోయారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

READ ALSO : Newsense : ‘న్యూసెన్స్’ ట్రైలర్.. మీడియాను టార్గెట్ చేశారా?

Image

ఇది ఇలా ఉండగా, టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ ను గౌరవించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తుండడం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడేందుకు కోహ్లీ తన సొంతగడ్డ ఢిల్లీ వచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ తన శిష్యుడిని చూసెందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకి వచ్చారు. తన క్రికెట్ లో ఓనమాలు నేర్పిన గురువును చూడగానే కోహ్లీ చేస్తున్న ప్రాక్టీస్ ను ఆపేశాడు. నేరుగా రాజ్ కుమార్ శర్మ వద్దకు చేరుకొని వినయంగా పాదాలకు నమస్కరించాడు.

read also : త్రిష ప్రియుడితో డేటింగ్ లో ఉన్నా : బిందు మాధవి

Visitors Are Also Reading