Home » ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిన సౌందర్య.. అసలు విషయం వెల్లడించిన ఎస్వీ కృష్ణారెడ్డి

ఆ హీరోతో సినిమా చేయనని చెప్పిన సౌందర్య.. అసలు విషయం వెల్లడించిన ఎస్వీ కృష్ణారెడ్డి

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం దర్శకుడిగానే కాదు.. హీరోగా , నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా , రచయితగా ఇలా చాలా పాత్రలు పోషించారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఫ్యామిలి సినిమాలకు కృష్ణారెడ్డి పెట్టింది పేరు. అప్పట్లో కృష్ణారెడ్డి సినిమా వస్తుందంటే కచ్చితంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు అనే టాక్ వినిపింేది.  రొటీన్ కథలతో ప్రేక్షకులకు బోరు కొట్టించకుండా ఎన్నో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ఈ సీనియర్ దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన కొబ్బరిబోండం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు కృష్ణారెడ్డి.

Advertisement

స్టార్ హీరోయిన్ సౌందర్యను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కృష్ణారెడ్డినే కావడం విశేషం. ఆయన దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు-గజేంద్రుడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు సౌందర్య. ఆతర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో మాయలోడు, నెంబర్ వన్, టాప్ హీరోలాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే కృష్ణారెడ్డి  ఓ సినిమా ఆఫర్ ఇస్తే మాత్రం సౌందర్య నో చెప్పారట.. నేను చేయను అని చెప్పారట సౌందర్య. అసలు విషయం ఏంటంటే.. కృష్ణ రెడ్డి కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో యమలీల సినిమా ఒకటి. అలీ హీరోగా నటించిన ఈ సినిమా బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చావు నుంచి అమ్మను కాపాడుకునే ఓ కొడుకు కథతో సినిమా తెరకెక్కించారు కృష్ణారెడ్డి.

Advertisement

ఈ సినిమాలో సెంటిమెంట్, ఎమోషన్స్, సంగీతం ప్రతిఒక్కరి హృదయాన్ని కదిలించింది. అయితే ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది స్టార్ హీరోలు కృష్ణారెడ్డికి ఫోన్ చేసి అలీ తో సినిమా ఏంటి..? మేము నటిస్తాం అని అడిగారట. దానికి కృష్ణారెడ్డి లేదు నేను అలీతోనే సినిమా చేస్తా అని చెప్పారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాలని సౌందర్యను కోరారట కృష్ణారెడ్డి. అయితే ఆమె నేను ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నాను. మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అలీతో నటించడం కుదరదు అని చెప్పేసిందట. దానికి ఓకే చెప్పిన కృష్ణారెడ్డి ఆ పాత్రకు ఇంద్రజాను ఎంపిక చేశారట. ఆ తర్వాత సౌందర్య చాలా ఫీల్ అయిందట. తన తండ్రితో కృష్ణారెడ్డికి ఫోన్ చేయించి క్షమాపణలు చెప్పిందట.. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో  తెలిపారు కృష్ణారెడ్డి.

Also Read :  సూపర్ స్టార్ రజినీకాంత్ ఫస్ట్ ‘లవ్ స్టోరీ’ గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading