Home » సినిమాల్లోకి రాకముందు ఎస్వీ కృష్ణా రెడ్డి అలాంటి పనులు చేశారా…?

సినిమాల్లోకి రాకముందు ఎస్వీ కృష్ణా రెడ్డి అలాంటి పనులు చేశారా…?

by AJAY
Ad

టాలీవుడ్ లోని టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఎస్వీ కృష్ణారెడ్డి ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి స్టార్ డైరక్టర్ గా ఆయన ఎదిగారు. డైరక్టర్ గా రచయితగా సంగీత దర్శకుడి గా మరియు నటుడు గా ఇలా సినిమాకు సంబందించిన అన్ని విభాగాల్లో కూడా ఆయన తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్ లో మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, శుభ లగ్నం తో పాటు మరికొన్ని మర్చిపోలేని సినిమాలు వచ్చాయి.

Advertisement

ఇక ఆయన 2014 లో చివరగా యమలీల 2 సినిమాను తీశారు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా ఇప్పుడు మళ్లీ ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంతే కాకుండా ఆయన మెగా ఫోన్ అందుకోవడం విశేషం. మెగాస్టార్ పిలిచి మరీ ఆయన కు ఆఫర్ ఇవ్వడం తో ఈసారి పక్కా ఎస్వీ కృష్ణా రెడ్డి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారు అని చాలా మంది నమ్ముతున్నారు. ఇక డైరెక్టర్ గా రీ ఎంట్రీ కి సిద్ధం అవుతుండటం తో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

Advertisement

sv krishna reddy

sv krishna reddy

ఆ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి రాకముందు తాను స్వీట్ షాప్ ను నడిపినట్లు వెల్లడించారు. తమది ఉన్నతమైన కుటుంబం అని కానీ సినిమా తీసే అంత డబ్బు లేదని అన్నారు. మొదటి సినిమా పగడాల పడవులు లో సెకండ్ హీరోగా చేశానని చెప్పారు. ఆ సినిమా చూసిన అచ్చిరెడ్డి నువ్వు ఇది కాదు చేయాల్సింది అనిపిస్తుంది అన్నారని చెప్పారు.

మనమే సినిమా చేద్దాం నువ్వే హీరో అని చెప్పారన్నారు. డబ్బు లేదు కదా సంపాదించి తీద్దాం అని స్వీట్ షాప్ పెట్టామని అన్నారు. ఆ షాప్ లో తాను కాజాలు…లడ్డూలు చేసేవాడిని అని తన గతం గురించి చెప్పారు. అంతే కాకుండా మొదటి సినిమా కొబ్బరి బోండాం చేసి ఆ సినిమా తోనే సూపర్ హిట్ కొట్టినట్టు తెలిపారు.

Visitors Are Also Reading