టాలీవుడ్ టాప్ కమెడియన్ లలో అలీ కూడా ఒకరు. బాల నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన అలీ స్టార్ కమెడియన్ గా ఎదిగారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ టీవీ షోలలోనూ సందడి చేస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ అలీ చురుకుగా ఉంటున్నారు. ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మెన్ గా అలీని నియమించినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అలీ అప్పట్లో హీరోగా కూడా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో అలీ యమలీల అనే సినిమాలో నటించారు.
ALSO READ : ఖిలాడీ టూ సలార్…ఇంతకీ ఈ చిన్నారి ఎవరో తెలుసా…?
Advertisement
ఈ సినిమా అతడి కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా అలీకి నటుడిగా కూడా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాలో కామెడీ చేసే హీరో అయితేనే సరిపోతారని అనుకున్నారట. దాంతో అలీని హీరోగా తీసుకున్నారట. ఈ సినిమాలోని పాటలు కూడా శ్రోతలు ఎంతో ఆకట్టుకోవడంతో విడుదలకు ముందే సినిమాపై అంచనాలు పెరిగాయి.
Advertisement
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సౌందర్యను అనుకున్నారట. అనంతరం సౌందర్య వద్దకు వెళ్లి కథను వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కానీ కథలో హీరోగా అలీ నటిస్తున్నారని చెప్పేసరికి సౌందర్య సినిమా చేయనని చెప్పారట. కెరీర్ పీక్స్ లో ఉన్న సౌందర్య తండ్రి వద్దని చెప్పడం వల్లే సౌందర్య ఈ సినిమాకు నో చెప్పారట.
దాంతో ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంద్రజ నటించింది. ఇక 1994 ఎప్రిల్ 28న ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరవాత అలీ శుభలగ్నం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలోని డ్యూయెట్ చినుకు చినుకు అందెలతో పాట కోసం సౌందర్యను సంప్రదించారు. ఈసారి మాత్రం సౌందర్య ఎలాంటి సందేహం లేకుండా ఎంటనే ఒప్పుకున్నారు. ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
Also Read:
RRR మల్లి తల్లి ఫ్లాష్ బ్యాక్ సీన్లను మొత్తం లేపేశారట…!
ఆచార్య ట్రైలర్ లో కొరటాల శివ ఇచ్చిన హింట్ గమనించారా ? ట్విస్ట్ మాములుగా లేదు గా !