Home » RRR మల్లి తల్లి ఫ్లాష్ బ్యాక్ సీన్ల‌ను మొత్తం లేపేశారట…!

RRR మల్లి తల్లి ఫ్లాష్ బ్యాక్ సీన్ల‌ను మొత్తం లేపేశారట…!

by AJAY
Ad

సాధారణంగా సినిమా తీసేటప్పుడు అనుకున్న కథకు సంబంధించిన స‌న్నివేశాలు అన్నీ చిత్రీకరిస్తారు. అలా చిత్రీకరణ పూర్తయిన తర్వాత కొన్ని సీన్లను ఎడిటింగ్లో తీసేస్తాను. నిజానికి సినిమా ఎడిటింగ్ అన్నది చాలా ముఖ్యం. సినిమా విజ‌యం చాలా వరకు ఎడిటింగ్ పై ఆధారపడి ఉంటుంది. అయితే అలా ఎడిటింగ్ చేసే సమయంలో కొంతమంది నటీనటుల సన్నివేశాలు కూడా ఎగిరి పోతూ ఉంటాయి. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా విష‌యంలో కూడా జరిగిందట.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాతో జక్కన్న మరోసారి తెలుగు సినిమా సత్తాను ఇండియా వ్యాప్తంగా చాటారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు ముఖ్యమైన నటీనటులందరూ తమ పాత్రలతో మెప్పించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో చిన్నారి మల్లి కి తల్లిగా నటించిన న‌టి ఎంతగానో ఆకట్టుకుంది.

Advertisement

Advertisement

మల్లి తల్లి పాత్రలో అహ్మరీన్ అంజుమ్ నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అహ్మ‌రీన్ ఎడిటింగ్ లో భాగంగా ఫ్లాష్ బ్యాక్ నుండి లేపేసిన ఓ సన్నివేశానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరు ఈ సన్నివేశాన్ని సినిమాల్లో చూడలేదు. ఫైనల్ ఎడిటింగ్లో దీన్ని తొలగించారు అని పేర్కొంది. నిజానికి సినిమాలో అహ్మ‌రీన్ కు సంబంధించిన మ‌రికొన్ని సన్నివేశాలు కూడా తొల‌గించార‌ట‌.

అంతే కాకుండా ఎన్టీఆర్ చేసిన కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా చాలావరకు తొలగించినట్టు తెలుస్తోంది. దాదాపుగా 20 నుండి 30 నిమిషాల సన్నివేశాలను జక్కన్న డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే వీటిని ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.

ALSO READ : Acharya movie : ఆచార్య ట్రైలర్ లో కొరటాల శివ ఇచ్చిన హింట్ గమనించారా ? ట్విస్ట్ మాములుగా లేదు గా !

Visitors Are Also Reading