Home » Acharya movie : ఆచార్య ట్రైలర్ లో కొరటాల శివ ఇచ్చిన హింట్ గమనించారా ? ట్విస్ట్ మాములుగా లేదు గా !

Acharya movie : ఆచార్య ట్రైలర్ లో కొరటాల శివ ఇచ్చిన హింట్ గమనించారా ? ట్విస్ట్ మాములుగా లేదు గా !

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా… రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.

Advertisement

ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇదిలా ఉండగా ట్రైలర్ చూసిన నెటిజన్లు సినిమా కథను అంచనా వేస్తున్నారు. తమ ఊహాగానాలతో ఆచార్య కథ ఇదేనంటూ ప్రచారం చేస్తున్నారు.

Advertisement

ఆ కథ ఏంటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం….. ఆచార్య సినిమా ధర్మస్థలి అనే పుణ్యక్షేత్రం చుట్టూ తిరుగుతుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని కాపాడేందుకు సిద్ధ (రామ్ చరణ్) ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అయితే ఆ తర్వాత సిద్ద ఊరు నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆచార్య చిరంజీవి ఊర్లోకి ఎంట్రీ ఇస్తాడు.

పుణ్యక్షేత్రాన్ని రక్షించే బాధ్యతను చిరంజీవి చూసుకుంటారు. సిద్ధ ఊరు నుండి ఎందుకు వెళ్ళిపోతాడు..? నక్సలైట్ల లో సిద్ధ ఎందుకు కలుస్తాడు..? అంతేకాకుండా ఆచార్య నక్సలైట్ల లో ఎందుకు కలిశాడు అన్నదే ఈ సినిమా కథ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చ‌ద‌వండి :

SRUTHI HASSAN : దాని సైజ్ ఎంత అంటూ నెటిజన్ ప్రశ్న… ఫోటో చూపించి కొలుచుకో అంటూ శ్రుతి హాసన్ స్ట్రాంగ్ రిప్లై…!

చిరంజీవి, శ్రీదేవి రిజెక్ట్ చేసిన‌ అద్భుత‌మైన సినిమా ఏదో తెలుసా…!

Visitors Are Also Reading