Home » ఖిలాడీ టూ స‌లార్…ఇంత‌కీ ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా…?

ఖిలాడీ టూ స‌లార్…ఇంత‌కీ ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా…?

by AJAY
Ad

కొన్ని సినిమాల‌లో చైల్డ్ ఆర్టిస్ట్ లు ఎంతగానో ఆక‌ట్టుకుంటారు. చిన్న‌వ‌య‌సులో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ త‌మ న‌ట‌న‌తో అల‌రిస్తారు. చిట్టి పొట్టి మాట‌ల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంటారు. ఇక రీసెంట్ గా ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ శాన్విత‌. ఖిలాడీ సినిమాలో న‌టించిన చిన్నారి శాన్విత ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది. ఈ సినిమాలో శాన్విత ర‌వితేజ‌కు కూతురుగా న‌టించి త‌న క్యూట్ యాక్టింగ్ తో ఫిదా చేసింది. నాలుగేళ్ల వ‌య‌సులోనే శాన్విత ఖిలాడీ సినిమాలో న‌టించింది.

ALSO READ : BHEEMLANAYAK : ఆడియో ఫంక్ష‌న్ కు వ‌ద్ద‌న్నాడ‌ట‌.. త్రివిక్ర‌మ్ పై బండ్ల గ‌ణేష్ ఫైర్..ఆడియో వైర‌ల్..!

Advertisement

khiladi child artist shanvitha

ప్ర‌స్తుతం శాన్విత వ‌య‌సు ఆరేళ్లు కాగా ఏకంగా ఏడు సినిమాల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది. శాన్విత త‌ల్లి దండ్రులు ఇద్ద‌రూ రంగ‌నాథ్ ప‌రిమ‌ళ డాక‌ర్లు కాగా వీరు నందిగామ‌కు చెందిన‌వారు. శాన్విత విజ‌య‌వాడ‌లోకి ఓ స్కూల్ లో చ‌దువుకుంటుంది. ఇక చిన్న‌ప్ప‌టి నుండి శాన్విత ఎంతో చ‌లాకీగా హుషారుగా ఉండేద‌ని ఆమె త‌ల్లిదండ్ర‌లు చెబుతున్నారు.

Advertisement

khiladi

khiladi

ఇక శాన్విత‌కు అవ‌కాశం ఎలా వ‌చ్చిందో ఇప్పుడు చూద్దాం…శాన్విత త‌ల్లి దండ్రుల‌తో క‌లిసి హైద‌రాబాద్ లోని త‌మ బంధువ‌ల ఇంట్లో జ‌రిగిన ఓ ఫంక్ష‌న్ కు హాజ‌రైంది. అయితే ఈ ఫంక్ష‌న్ లో పాప‌ను చూసిన ద‌ర్శ‌కుడు యోగి త‌న స్నేహుతుడు న‌రేష్ కు ఆమె ఫోటోల‌ను పంపించాడు. ఆ ఫోటోల‌ను చూసి పాప‌ను సినిమాలో ఫైన‌ల్ చేశారు. ఇక అలా ఖిలాడీ ఆఫ‌ర్ ద‌క్కించికున్న శాన్విత ఇప్పుడు ఏకంగా ఏడు సినిమాల్లో న‌టిస్తుంది.

 

అంతే కాకుండా శాన్విత చేస్తున్న ఏడు సినిమాల్లో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న స‌లార్ సినిమా కూడా ఒక‌టి కావ‌డం విశేషం. ఇదిలా ఉంటే ఈ చిన్నారి షూటింగ్ స‌మయంలో గ్లిజ‌రిన్ లేకుండా క‌న్నీళ్లు పెట్టి ద‌ర్శ‌కుడితో ప్ర‌శంస‌లు అందుకుంద‌ట‌. అంతే కాకుండా షూటింగ్ గ్యాప్ లో ర‌వితేజ తో క‌లిసి ఆడుకుంద‌ట‌.

Visitors Are Also Reading