Home » సౌందర్య, నగ్మా కలిసి నటించిన ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయా ? 

సౌందర్య, నగ్మా కలిసి నటించిన ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయా ? 

by Anji
Ad

1990లో యూత్ కి పిచ్చి ఎక్కించిన హీరోయిన్ ఎవరంటే నగ్మా అనే చెప్పవచ్చు.తన గ్లామరస్ పాత్రలతో ఆమె ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ హృదయాల్లో నిలిచిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్  వంటి హీరోలతో ఆమె చాలా సినిమాల్లో నటించింది. సరదాబుల్లోడు, మేజర్ చంద్రకాంత్, ఘరానామొగుడు, అల్లరి అల్లుడు వంటి త్రాలతో ఆమె యూత్ కి మరింత దగ్గరయ్యారు. నగ్మా కి సరి సమానంగా సౌందర్య పదహారణాల తెలుగు అమ్మాయిలా అమ్మోరు,పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా వంటి సినిమాలలో  తన నటనతో పలకరిస్తూనే ఉండేది. 

Also Read :  X, Y, Z, Z+ కేటగిరి భద్రత అంటే ఏంటి? ఎవరికి ఈ భద్రత కల్పిస్తారు.

Advertisement

Manam News

నగ్మా, సౌందర్య ఇద్దరూ  1990లో సౌత్ ఇండియా సినిమాల్లో ఓ ఊపు ఊపారు. సౌందర్య, నగ్మా ఇద్దరు విడివిడిగా నటించిన చాలా చిత్రాలు విజయవంతమయ్యాయి. కానీ వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే మాత్రం ఆ సినిమా ఫెయిల్యూర్ అయ్యేది. అలాంటి వాటిలో కె. మురళి మోహన్ రావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించిన 1994 నాటి యాక్షన్ చిత్రం సూపర్ పోలీస్. ఈ చిత్రానికి  ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.  ఇందులో వెంకటేష్, నగ్మా, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అదే పేరుతో తమిళంలోకి కూడా అనువదించారు. ఖేల్ ఖిలాడి కా అని హిందీలోకి అనువదించారు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నమోదైంది. ఈ సినిమా తరువాత నగ్మా సౌందర్య కలిసి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించారు. 

Advertisement

Also Read :  అఖిల్ కెరీర్ లో భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సినిమాలు ఇవే…!

 

శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్, క్రాంతి కుమార్ నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “రిక్షావోడు” విడుదలైంది.ఈ సినిమాలో నగ్మా, సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం పోషించారు.  చిరంజీవి రిక్షావోడుగా మాస్ లుక్ తో అభిమానులను అలరించినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం పరాజయం పాలైంది. ఇలా ఒక ఏడాది గ్యాప్ లోనే నగ్మా ,సౌందర్య కలిసి నటించిన సూపర్ పోలీస్, రిక్షావోడు వంటి చిత్రాలు ఫెయిల్యూర్ కావడంతో ఆ తర్వాత నిర్మాతలు తాము నిర్మించబోయే ఏ సినిమాలో కూడా నగ్మా, సౌందర్య ఇద్దరికీ కలిపి తీసుకోలేదట. 

Also Read :  అల్లరి నరేష్ “ఉగ్రం” సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!

Visitors Are Also Reading