Home » అఖిల్ కెరీర్ లో భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సినిమాలు ఇవే…!

అఖిల్ కెరీర్ లో భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సినిమాలు ఇవే…!

by AJAY
Ad

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అఖిల్ … వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మూవీతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచింది.

 

ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు అఖిల్ చాలా సినిమాల్లో నటించాడు. అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను మినహాయిస్తే ఏ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక అఖిల్ తన కెరియర్లో ఇప్పటివరకు నటించిన మూవీలలో కొన్ని మూవీలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్లు జరిగి ఆ తర్వాత ఆ సినిమాలకు నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలను చవిచూసిన సినిమాలు ఉన్నాయి. అలా అఖిల్ కెరీర్ లో భారీ నష్టాలను చవిచూసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

Advertisement

Advertisement

 

అఖిల్ : అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే నెగెటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీకి దాదాపు 26 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. వి వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని నితిన్ నిర్మించాడు.

ఏజెంట్ : అఖిల్ తాజాగా ఏజెంట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సాక్షా వైద్య హీరోయిన్గా నటించిన ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా … మమ్ముట్టి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. 28 ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే ఘోరమైన నెగిటివ్ టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు 30 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది

Visitors Are Also Reading