Home » బలగం మూవీలో నటించిన ఈమె భలే ఛాన్స్ కొట్టేసిందిగా ? ఆ స్టార్ దర్శకునితో..!

బలగం మూవీలో నటించిన ఈమె భలే ఛాన్స్ కొట్టేసిందిగా ? ఆ స్టార్ దర్శకునితో..!

by Anji
Ad

జబర్దస్త్ వేణు దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి చిత్రం బలగం. ఈ సినిమా ద్వారా ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  ఈ సినిమాకి ఎన్నో అవార్డులు వరించాయి. మరోవైపు కొంత మంది ఎప్పటి నుంచో విడిపోయి ఉన్న కుటుంబాలు సైతం కలిసిపోాయాయి. వేణును పలువురు ప్రశంసించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించిన సౌధామని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 

Also Read :   PS-2 REVIEW&RATING: పొన్నియన్ సెల్వన్ 2 టాక్ అదిరిపోలా..?

Advertisement

ఈ మూవీలో  పెద్దగా సీన్లు పడకపోయినా.. స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా తన సిగ్గుతో ఇన్నోసెంట్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు సౌధామని. కేవలం  ఆకట్టుకోవడమే కాదు..ఆమె ఉన్నంత సేపు అందరి చూపులను తన వైపే తిప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఆమె మరొక  సినిమాలో  నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈసారి ఏకంగా ఓ అగ్రదర్శకుడి సినిమాలోనే కీ రోల్ లో నటించేందుకు ఛాన్స్ కొట్టేశారు. సినిమాల్లో నటించాలనే కోరికతో టాలీవుడ్ లో ఆర్టిస్టుగా రాణించాలనే ఆశతో ఉన్న సౌధామిని.. బలగం మూవీలో తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఫర్పెక్ట్ గా యుటిలైజ్ చేసుకుంది.  

Advertisement

Also Read :   Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారంలో నష్టాలుంటాయి

ఎన్నోసెంట్ అమ్మాయి పాత్రలో సిగ్గు పడుతూ అందరినీ ఆకట్టుకుంది. ఆ క్యారెక్టర్ కోసం దర్శకుడు చెప్పారని.. 10 కేజీలు వెయిట్ పెరిగారట. తనకు దొరికిన ఆ చిన్న పాత్రలో మనస్సు పెట్టి నటించింది. తాజాగా ఈ బ్యూటీ జాతీ రత్నాలు దర్శకుడి నుంచి నేరుగా ఆఫర్ వచ్చేలా చేసుకున్నారు. జాతి రత్నాలు సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకు అనుదీప్.. తాజాగా బలగం ఫేమ్ సౌధామినికి కాల్ చేసి అప్రిషియేట్ చేశారట. అప్రిషియేట్ చేయడమే కాదు.. తన తరువాత సినిమాలో ఓ ముఖ్య పాత్ర ఇస్తానని మాట కూడా ఇచ్చారట. ఇక ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తానే చెప్పారు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read  :  Vyavastha Web Series Review : ఆ డైరెక్టర్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా ?

Visitors Are Also Reading