సోనూసూద్ అంటే ఇప్పుడు తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన సినిమాల్లో నటించినప్పుడే కేవలం సినిమా అభిమానులకు మాత్రమే పరిచయం. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోనూసూద్ పేరు మారు మ్రోగిపోతుంది. ముఖ్యంగా కరోనా, లాక్‌డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది పేదలకు సహాయం చేసారు సోనూసూద్. ఎందరివో కష్టాలు తీర్చి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్‌పై అభిమానంతో చాలా మంది అరుదైన గౌరవం ఇచ్చారు.
Also Read: ఇంత వరకు సినిమాల్లో తన ఎడమచేయి చూపించని హీరోయిన్! ఎందుకిలా?
Advertisement
కరోనా సమయం నుంచి ప్రతీ ఒక్కరికీ సహాయ సహకారాలందిస్తూ ప్రజల్లో దేవుడిగా కళియుగ కర్ణుడిగా పేరు సంపాదించుకున్న సోనూసూద్ కోసం ఎన్నో రాజకీయ పార్టీలు వెల్కమ్ చెప్పడానికి సిద్ధం అయ్యాయి. తాను ఇప్పుడు రాజకీయాల్లోకి రాను తన లక్ష్యాలు నెరవేరిన తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని.. మరొక ఐదేండ్ల తరువాత రాజకీయాల్లోకి వస్తానని ఇటీవలే ప్రకటించాడు సోనూసోద్.
ముఖ్యంగా సోనూసూద్ చేసిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అతను చేసిన మంచి పనులను ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది. అవార్డుతో సత్కరించి.. సోనూసూద్‌కు సరైన గౌరవం అందజేసింది. సోషల్ మీడియాలో తనకు ప్రాబ్లం వచ్చిందంటే చాలు ఇప్పటికీ సోనూసూద్ వెంటనే స్పందించి.. సాయం చేసి శబాష్ అనిపించుకుంటాడు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది వలస కూలీలకు అన్నంపెట్టి, స్వస్థలాలకు చేర్చాడు. ఆర్థికంగా వెనుకబడిన వారికి సర్జరీ కూడా చేయించారు.
Advertisement
సోనూసూద్ చేసిన సేవలకు ఐక్యరాజ్యసమితి గుర్తించి.. స్పెషల్ హ్యుమనిటేరియన్ అవార్డుతో సత్కరించింది. యునైటేడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగమైన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ కార్యచరణలో భాగంగా అవార్డు ప్రదానం చేశారు. జనవరి 26,2022 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం అన్ని రంగాల వారికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో.. ఇప్పుడు, ఎప్పుడు నిత్యం సేవ చేసే సోనూసూద్ పేరు పద్మ అవార్డుల జాబితాలో లేకపోవడం గమనార్హం. వాస్తవానికి గత ఏడాది సోనూసూద్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల ఆయన అభిమానులు పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఈ నేపథ్యంలో కొందరూ స్పందిస్తూ.. సోనూసూద్ ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ‘దేశ్ కా మెంటర్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిటర్‌గా వ్వవహరిస్తున్నందుకే సోనూసూద్‌కు అవార్డుల జాబితాలో చోటు దక్కలేదు అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరికొందరూ రాజకీయ కుట్ర ఉందని, అందుకే సోనూసూద్‌కు పద్మ అవార్డు దక్కలేదని పేర్కొంటున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 128 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది.
Also Read: ఆ టాలీవుడ్ నిర్మాతతో శ్రీరెడ్డి వివాహం..?