Telugu News » ఇంత వ‌ర‌కు సినిమాల్లో త‌న ఎడ‌మ‌చేయి చూపించ‌ని హీరోయిన్! ఎందుకిలా?

ఇంత వ‌ర‌కు సినిమాల్లో త‌న ఎడ‌మ‌చేయి చూపించ‌ని హీరోయిన్! ఎందుకిలా?

by Azhar

బ్యూటీ క్వీన్ గా బాలీవుడ్ లో పేరు సంపాదించిన మీనాకుమారి త‌న అందంతో ప్రేక్ష‌కుల మ‌తులు పోగెట్టేది. జ‌న్మ‌త‌: ముస్లీం అయిన మీనాకుమారి అస‌లు పేరు మెహ‌జ‌బీన్ బేగం. ఆమె తండ్రి అలీ బ‌క్ష్ థియేట‌ర్ ఆర్టిస్ట్‌. ఆమె త‌ల్లి కూడా న‌టిగా మంచి పేరు సంపాదించుకుంది.

Ads

Also Read: rasi phalalu in telugu : ఈ రాశుల వారు డ‌బ్బులు కోల్పోతారు

అందం, అభిన‌యం అద్భుతం…మ‌రి ఆ ఎడ‌మ‌చేయి ఎందుకు చూపించ‌లేదు? :

1951 మే 21న మీనా కుమారి త‌న భ‌ర్త క‌మ‌ల్ తో క‌లిసి త‌మ కార్ లో మ‌హాబ‌లేశ్వ‌ర్ నుంచి ముంబై వెళ్తున్నారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు వీరు ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ఆ ప్ర‌మాదంలో మీనాకుమారి ఎడ‌మ చేయి రూపునే కోల్పోయింది. ఆ ఘ‌ట‌న త‌ర్వాత ఆమె న‌టించిన ప్ర‌తి సినిమాలో త‌న ఎడ‌మచేతిని చీర‌తోనో , దుప్ప‌ట్టాతోనే క‌వ‌ర్ చేసేది.

బ్యూటీ క్వీన్ యే కాదు ట్రాజెడీ క్వీన్ కూడా :
ఎంత పేరు సంపాదించిందో చివ‌ర్లో అన్నే బాధ‌లు ప‌డింది మీనాకుమారి. సినిమాల్లో న‌టించినంత కాలం ఆమె జీవితం బాగానే గ‌డిచింది జీవిత చ‌ర‌మాంకంలో ఒంట‌రిగా జీవించింది. హాస్పిట‌ల్ బిల్ క‌ట్ట‌లేని స్థితిలో అమె అభిమాని ఆ బిల్ ను పే చేశాడట‌

Also Read: సోనూసూద్‌కు ప‌ద్మ అవార్డు ఏది..?


You may also like