Home » ఇండియాలోనే మొదటిసారిగా ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన ఎన్టీఆర్

ఇండియాలోనే మొదటిసారిగా ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన ఎన్టీఆర్

by Bunty
Ad

చిత్ర పరిశ్రమలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో… స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఉండరు. ఆనాటి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి…. స్టార్ హీరోగా ఎదిగాడు నందమూరి తారకరామారావు. స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా… ఓ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికయ్యారు నందమూరి తారక రామారావు. 1980 ఆ కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారకరామారావు.

Advertisement

పార్టీ స్థాపించిన తొలి ఏడాది ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో అధికారంలోకి వచ్చింది. ఈ తరుణంలోనే స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక.. మండలాల వ్యవస్థను తీసుకువచ్చి గొప్ప నాయకుడిగా పేరు పొందారు. అలాగే పేదలకు రూపాయికే కిలో బియ్యం పథకాన్ని కూడా తీసుకువచ్చారు. ఇక…. బీసీలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు స్వర్గీయ నందమూరి తారక రామారావు.

Advertisement

అలాగే ఆనాటి కాలంలోనే… పిల్లలకు ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పించే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. భారత దేశంలో ప్రథమంగా… ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా బోధనకు వీడియో పాఠాలు చెప్పేటువంటి దృశ్య శ్రావణ విద్యా బోధన విధానాన్ని… అప్పటి ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని 1987 జూన్ 17వ తేదీన ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో ప్రారంభించి చరిత్ర సృష్టించారు నందమూరి తారక రామారావు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

తెలంగాణలో వారందరికీ లక్ష రూపాయలు… ఇలా అప్లై చేసుకోండి

యాంకర్ రష్మీ..ఒక్క షోకు ఎంత తీసుకుంటుందో తెలుసా ?

మనిషి ఎప్పుడు నిద్రలేవాలి.. రాత్రి మెలకువ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి ?

Visitors Are Also Reading