అన్నా చెల్లెల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి కష్టాల్లోనైనా చెల్లికి తోడుగా ఉండేది అన్నయ్య. అయితే 2002లో వి.సముద్ర దర్శకత్వంలో వచ్చినటువంటి ‘శివరామరాజు’ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో చెప్పనవసరం లేదు. అన్నా చెల్లెల అనుబంధాన్ని ప్రత్యక్షంగా చూపించారు. ఇందులో జగపతిబాబు, శివాజీ, వెంకట్, మోనిక ప్రధాన పాత్రల్లో నటించారు. వీరి నటనకు గాను కోట్లాదిమంది అభిమానులు ఫిదా అయ్యారు.
Advertisement
శివరామరాజు చిత్రంలో ముగ్గురు అన్నా తమ్ముళ్లకు ముద్దుల చెల్లెలుగా నటించి తన సెంటిమెంటల్ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి నటి మోనిక. ఇక మోనిక గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. స్వాతి అలియాస్ మోనిక ఇప్పుడు ఎలా ఉంది… ఏం చేస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం… మోనిక తెలుగులో మా అల్లుడు వెరీ గుడ్, కొడుకు వంటి మొదలైన సినిమాలలో నటించారు. ఈమె తండ్రి హిందువు అయితే, తల్లి క్రిస్టియన్.
Advertisement
మోనిక అసలు పేరు రేఖ మారుతి రాజ్. మోనిక తన చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా బిజీ లైఫ్ లీడ్ చేశారు. ఇక మోనిక మల్లిక్ అనే ముస్లిం వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2014లో ముస్లిం మతం తీసుకుని తన పేరుని ఎంజి రహీమాగా మార్చుకొని మరి వివాహం చేసుకున్నారు. ఇక వివాహా అనంతరం సినిమాలలో నటించను అని చెప్పి సంచలన ప్రకటన చేసింది. ఈమె భర్త చెన్నైకి చెందిన వ్యాపారవేత్త. ప్రస్తుతం మౌనిక సినిమాలకు దూరంగా ఉంటూ తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తుంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Comedian Ali : ఫ్లైట్ ప్రమాదం నుంచి బయట పడిన అలీ కుటుంబం.. !
CM KCR : సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఆ క్యాప్ ఎందుకు పెడతారు ?
హీరోయిన్ల కంటే ఈ సైడ్ క్యారెక్టర్లకే ఎక్కువ ఫిదా అయ్యారు…!