Home » 2007 లో ధోనీనే కెప్టెన్‌గా ఎందుకు BCCI నియమించింది ?

2007 లో ధోనీనే కెప్టెన్‌గా ఎందుకు BCCI నియమించింది ?

by Bunty
Ad

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్తుత సారథి మహేంద్రసింగ్ ధోని గురించి తెలియని వారు ఉండరు. టీమిండియా కు అశేష విజయాలను అందించిన మహేంద్రసింగ్ ధోని… అంటే ఇప్పటికీ చాలామందికి ఇష్టమే. 2007 టి20 ప్రపంచ కప్ నకు ముందు… టీమిండియా జట్టులోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని… అనధి కాలంలోనే టీమిండియా జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టారు. టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే 2007 t20 ప్రపంచ కప్ టోర్నీని… ఇండియాకు అందించారు ధోని.

Advertisement

అలాగే 2011 వన్డే వరల్డ్ కప్ కూడా ధోని సారథ్యంలోనే టీమిండియా కు వచ్చింది. టి20, వన్డే మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్లో కూడా టీమిండియా జట్టును నెంబర్ వన్ స్థాయిలో నిలిపాడు మన మహేంద్రుడు. ఇక చివరిగా 2013 సంవత్సరంలో టీమిండియా జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ ని అందించి… కెప్టెన్స్ కి అలాగే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు మహేంద్ర సింగ్ ధోని. కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మాత్రం కెప్టెన్ గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అంతేకాదు చెన్నైకి ఇప్పటికే ఐదు టోర్నీలను అందించిన తొలి కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు ధోని. వికెట్ల వెనుక చాలా ప్రశాంతంగా కనిపించే మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా జట్టుకు… తన స్కెచ్ లతో అనేక విజయాలను అందించిన దిట్ట.

Advertisement

అలాంటి మహేంద్ర సింగ్ ధోని గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 2007 కాలంలో… ధోనీనే బీసీసీఐ ఎందుకు కెప్టెన్ చేసింది అనే ప్రశ్నపై తాజాగా సమాధానం దొరికింది. 2007 సంవత్సరంలో బీసీసీఐ టీమిండియా కెప్టెన్గా ధోని నియమించడానికి గల కారణాలను మాజీ సెలెక్టర్ భూపేందర్ సింగ్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…. టీమిండియా ప్లేయర్ల బాడీ లాంగ్వేజ్, ఒక కెప్టెన్ కు ఉండవలసిన స్కిల్స్ మహేంద్ర సింగ్ ధోని లో ఉన్నాయని ఆయన తెలిపారు. జట్టును కెప్టెన్ గా ముందుండి నడిపే సామర్ధ్యత ధోనికి ఉందని… అలాగే తోటి క్రికెటర్లకు మంచి బూస్ట్ ఇచ్చే తత్వం కూడా ధోనికి ఉందని భూపేందర్ సింగ్ చెప్పారు. అలాగే మహేంద్ర సింగ్ ధోని ఆటతీరు కూడా బాగుందని అందుకే 2007లో టీమిండియా కెప్టెన్ చేశారని వివరించారు మాజీ సెలెక్టర్ భూపేందర్ సింగ్.

ఇవి కూడా చదవండి

Hardik Pandya : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య..రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌

Shikhar Dhawan : ICC టోర్నమెంట్లలో శిఖర్‌ ధావనే మొనగాడు..కోహ్లీ, రోహిత్‌ పనికిరారు ?

గత 10 ఏళ్లుగా టీమిండియా.. ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీలను ఎందుకు గెలవడం లేదు ?

Visitors Are Also Reading