Home » మహేష్ బాబు పాటు అదిరిపోయే స్టెప్పులేసిన సితార..!

మహేష్ బాబు పాటు అదిరిపోయే స్టెప్పులేసిన సితార..!

by Anji
Ad

సూపర్ స్టార్ మహేశ్ బాబు  కూతురు సితార గురించి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరమే లేదు. ఈమె గతంలోనే డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. తాజాగా  మరోసారి తన డ్యాన్స్ తో అభిమానులను అలరించింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ కిడ్ ‘గుంటూరు కారం’  మూవీ లోని పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఉర్రూతలూగించింది. ఈ మేరకు ‘ట్రిప్పింగ్.. ట్రిప్పింగ్’ అనే పాటకు డ్యాన్స్ అదరగొట్టేసింది.

Advertisement

Advertisement

అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోను తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ దిస్ ట్యూన్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. వైట్ అండ్ పింక్ ప్రింటెడ్ ఫ్లవర్స్ ఉన్న పంజాబీ డ్రెస్ ధరించి క్యూట్ గా కనిపించిన సితార.. మాస్ స్టెప్పులకు మహేశ్ బాబు ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. తండ్రికి తగ్గ తనయురాలు అంటూ కొనియాడుతున్నారు.

 

ఇదిలా ఉంటే..  ఇటీవలే మహేష్ ఇంట్లో జరిగిన ‘గుంటూరు కారం’ సక్సెస్ పార్టీలో సితార స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. టీమ్ అందరితో కలిసి తెగ సందడి చేసింది. చాలా చిన్న వయసులోనే యూ ట్యూబ్ ఛానల్ రన్ చేయడంతో పాటు ఓ జ్యయలరీ సంస్ధకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సితార ఇంతవరకు ఏ స్టార్ కిండ్ అందుకోని బంపర్ ఆఫర్ అందుకుంది.

Visitors Are Also Reading