సాధారణంగా ఏ సీజన్‌లో ఏ పండ్లు ఉంటాయో ఆ పండ్లను తప్పకుండా తింటే మనకు ఆ సీజన్‌లో ఉండే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రస్తుతం సీతాఫలాల సీజన్ వచ్చిందనే చెప్పాలి. సెప్టెంబర్ మాసం నుంచే ప్రతీ యేటా సీతాఫలాలు పండుతుంటాయి. ఈ సీతాఫలాల సాగుకు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ ఫేమస్ అనే చెప్పాలి.
ఇది కూడా చదవండి : RRR, KGF 2, కార్తికేయ 2 తో సహా బాలీవుడ్ లో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే..!
Advertisement
ముఖ్యంగా ఏపీలోని కొండ ప్రాంతాల్లో వందశాతం సేంద్రియ పద్దతిలోనే గిరిజనులు సీతాఫలాల తోటలను సాగుచేస్తున్నారు. వీటి నుంచి వచ్చే దిగుబడులు నాణ్యమైనవి కావడంతో రుచిగా ఉండడం వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మన్యం సీతాఫలాలకు మంచి గిరాకే ఉంటుంది. ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు అక్కడి సీతాఫలాలను కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువగా ఏపీలోని పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని ఏజెన్సీలో సీతాఫలం పంట సాగు అవుతోంది. ప్రతీ సంవత్సరం ఆగస్టు చివరి వారం నుంచి నవంబర్ వరకు వీటి సీజన్ కొనసాగుతుంది. ఇక ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలోనే ఈ పంట చేతికి రావడంతో గిరిజన రైతులు సంబురపడుతున్నారు.
Advertisement
మన్యంలో ఏటా వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 8 టన్నుల దిగుబడి వస్తుందన్నది గిరిజన రైతుల లెక్క. కిలో రూ.15 నుంచి రూ.25కి గిరిజనుల వద్ద వ్యాపారాలు కొనుగోలు చేసి గ్రేడ్‌లుగా విభజిస్తారు. తరువాత సాధారణ రకాన్ని మార్కెట్ లో రూ.40 నుంచి రూ.50కి గ్రేడ్-1 రకం అయితే రూ.70 నుంచి 80కి అమ్ముతున్నారు. సాధారణంగా ప్రతీ యేటా దాదాపు రూ.100 కోట్ల వరకు సీతాఫలం వ్యాపారం కొనసాగుతున్నట్టు అంచనా. రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువగా ఆదాయం సమకూరుతోంది. సీతాఫలాల్లో మానవ శరీరానికి కావాల్సిన పలు పోషకాలు లభిస్తాయి. విటమిన్ ఏ, బీ-6, సీ, మెగ్నిషియం, కాపర్, పొటాషియం, ఐరన్ వంటివి ఉంటాయి. కండరాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతాయి. ప్రధానంగా నరాల బలహీనతతో బాధపడేవారు సీతాఫలాలను తినడం చాలా మంచిది అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఆరోగ్యకరమైన చర్మం కోసం అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఇవే..!
ముఖ్యంగా సీతాఫలాన్ని తేనేను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన బరువు సొంతం అవుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు శక్తినిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి సీతాఫలం చక్కటి ఔషదం అనే చెప్పాలి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ని బయటికి పంపి, ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. గర్బణీలు ఈ ఫలాన్ని తినడం ద్వారా కడుపులో ఉండే బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక శిశువు మెదడు, నాడీ వ్యవస్థ కూడా మెరుగు అవుతుంది. తల్లిలో పాలవృద్ధికి కూడా దోహదపడుతుంది. అదేవిధంగా మలబద్ధకం సమస్యతో బాధపడే వారు సీతాఫలాలు తినడం చాలా మంచిది. పీచు పదార్థం అధికంగా ఉంటుంది. సీతాఫలం జ్యూస్ లేదా నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అల్సర్, గ్యాస్, ఎసిడిటీ వంటి ఉదర సమస్యలను నివారిస్తుందనే చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ సీజన్‌లో లభించే సీతా ఫలాన్ని తినండి ఆరోగ్యంగా ఉండండి.
ఇది కూడా చదవండి : మీరు నరాల వీక్‌నెస్‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ ఫుడ్ తప్పకుండా తీసుకోండి..!