Home » మీరు న‌రాల వీక్‌నెస్‌తో బాధ‌పడుతున్నారా..? అయితే ఈ ఫుడ్ త‌ప్ప‌కుండా తీసుకోండి..!

మీరు న‌రాల వీక్‌నెస్‌తో బాధ‌పడుతున్నారా..? అయితే ఈ ఫుడ్ త‌ప్ప‌కుండా తీసుకోండి..!

by Anji
Ad

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ప్ర‌తీ ఒక్క‌రూ ఉరుకుల ప‌రుగుల జీవిత‌మే గ‌డుపుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ఆరోగ్యం గురించి ప‌ట్టించుకునే వారిని వేళ్ల‌పై లెక్క‌పెట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా డ‌బ్బుల‌ను ఎలా సంపాదించాలి..? జీవితంలో ఎలా ఉండాలి..? అనే వాటిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుంటారు. కానీ ఆరోగ్యం మీద అంత‌గా శ్ర‌ద్ధ పెట్ట‌రు. అందుకే నిండు నూరేండ్లు బ్ర‌త‌కాల్సిన వారు మ‌ధ్య‌లోనే మ‌ర‌ణిస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్ర‌తీరోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌నే తినాలి. అవి ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


డ్రై ప్రూట్స్ :

Advertisement

వీటిలో పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు దివ్య ఔష‌దంతో స‌మానం. ఎందుకంటే వీటిలో ఉండే పోష‌కాలు న‌రాల‌ను బ‌లోపేతం చేస్తాయి. న‌రాల‌ను బ‌లంగా చేయ‌డంలో మెగ్నీషియం కీల‌క పాత్ర వ‌హిస్తుంది. మెగ్నీషియం డ్రై ఫ్రూట్‌లో ఎక్కువ‌గా ఉంటుంది. వాల్‌న‌ట్స్‌, బాదం, జీడిప‌ప్పుల‌ను మీరోజు వారి ఆహారంలో చేర్చండి.

చేప‌లు :

చేప‌ల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ల‌కు కొంద‌రూ ఇది నరాల‌ను బ‌లోపేతం చేయ‌డంలో ముందుంటుంది. అందుకే న‌రాలు బ‌ల‌హీనంగా ఉండే వారు త‌ర‌చుగా తింటుంటారు. చేప‌ల వ‌ల్ల ఎన్నో లాభాలుంటాయి.

ఇది కూడా చ‌ద‌వండి : టీమిండియా దుబాయ్‌లో బ‌స చేసే హోట‌ల్‌లో రోజుకు ఎంతో తెలుసా..?

ఆకుకూర‌లు :

Advertisement

ఆకుప‌చ్చ‌గా ఉన్న కూర‌గాయలు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ర‌కాల పోష‌కాలుంటాయి. మ‌న శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంతో పాటు ఎన్నో ర‌కాల రోగాల‌ను న‌యం చేస్తాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ముఖ్యంగా గ్యాస్ ఉన్న వారు నిత్యం ఆకుకూర‌లు తింటే వారికి గ్యాస్ స‌మ‌స్య త‌గ్గుతుంది. వీటిలో మెగ్నిషియం, విట‌మిన్ బీ, విట‌మిన్ సీ, విట‌మిన్ ఈ, కాల్షియం, కాఫ‌ర్‌, ఫోలేట్ పుష్క‌లంగా ఉంటాయి. మీ న‌రాలను బ‌లంగా ఉంచుతాయి. శ‌రీరం కూడా బ‌లంగా త‌యార‌వుతుంది. అందుకే తాజా ఆకుకూర‌ల‌ను తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

హెల్తీ విత్త‌నాలు :

కొన్ని ర‌కాల విత్త‌నాలు కూడా న‌రాల బ‌ల‌హీన‌తను పోగొడుతాయి. ముఖ్యంగా అవిసె గింజ‌లు, చియా విత్త‌నాలు, గుమ్మ‌డి గింజ‌ల‌ను రోజు తినండి. వీటిలో ప్రోటీన్లు, ఖ‌నిజాలు, యాంటి ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి. కాబ‌ట్టి వీటిని తీసుకుంటే న‌రాల బ‌ల‌హీన‌త స‌మ‌స్య లేకుండా పోతుంది.

ఇది కూడా చ‌ద‌వండి : “అమ్మోరు” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? ఏం చేస్తుందంటే….?

డార్క్ చాక్లెట్లు :

డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవ‌నాయిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శ‌రీరాన్ని శక్తివంతంగా త‌యారు చేస్తాయి. ఈ చాక్లెట్ల‌లో న‌రాల‌ను బ‌లంగా మార్చే మెగ్నిషియం కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి : Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఇవాళ ఆ రాశుల వారికి అన్ని శుభాలే..!

Visitors Are Also Reading