Home » ‘సీతా రామం’ సినిమా విడుద‌ల అప్పుడేనా..?

‘సీతా రామం’ సినిమా విడుద‌ల అప్పుడేనా..?

by Anji
Ad

దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా, హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సీతా రామం సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌లో వ‌స్తుండ‌డంతో సినిమాపై ప్రేక్ష‌కుల‌లో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమాలో పుష్ప స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఆమె ఈ సినిమాలో హీరోయిన్ కాదు. కానీ ఒక హీరో రేంజ్ పాత్ర‌లో క‌నిపించ‌నుందంటూ సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.


ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు రాఘ‌వ‌పూడి మాట్లాడుతూ సినిమాలో ర‌ష్మిక పాత్ర ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంటుంద‌ని చెప్పాడు. ఆమె క‌నిపించినంత స‌మ‌యం అద్భుతంగా ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతున్న త‌రుణంలో ర‌ష్మిక మంద‌న్న అభిమానుల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. క‌రోనా వ‌ల్ల ఆల‌స్య‌మైన ఈ సినిమాను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. అప్పుడు.. ఇప్పుడు అంటూ వాయిదా వేస్తూ వ‌చ్చిన ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Advertisement


ఇప్ప‌టి వ‌ర‌కు సీతా రామం సినిమా విడుద‌ల స‌మ‌యంలో వైజ‌యంతి మూవీస్ వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. కానీ త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీ విష‌యంలో క్లారిటీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే సినిమాను వ‌చ్చే ఆగ‌స్టులో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఆగ‌స్టులో పెద్ద సినిమాలున్న త‌రుణంలో స‌రైన స‌మ‌యంలో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. దుల్క‌ర్ స‌ల్మాన్‌కు మ‌హాన‌టి సినిమాతో మంచి గుర్తింపు ద‌క్కింది. తెలుగులో ఆయ‌న ఓ స్టార్‌గా మంచి పేరుంది. సీతా రామం సినిమాతో దుల్క‌ర్ మ‌రొక విజ‌యాన్ని ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మంటూ ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also Read : 

కొర‌టాల శివ‌కి థ్యాంక్స్ చెప్పిన ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌.. ఎందుకో తెలుసా..?

కంప్యూటర్ ముందు పని చేసేవారు.. ఈ వ్యాయామం చేస్తే ఎంతో మేలు..!!

 

Visitors Are Also Reading