Home » సిరి ప్రియుడు శ్రీ‌హ‌న్‌కు బిగ్‌బాస్ భారీ ఆఫ‌ర్ ఇవ్వ‌నుందా..?

సిరి ప్రియుడు శ్రీ‌హ‌న్‌కు బిగ్‌బాస్ భారీ ఆఫ‌ర్ ఇవ్వ‌నుందా..?

by Anji
Ad

బిగ్‌బాస్ షోలో ఎంట‌ర్ త‌రువాత పాపులారిటీని సాధించ‌డం అటుంచితే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టి కొంత మంది కంటెస్టెంట్లు న‌గిటివిటీని మూట‌గ‌ట్టుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. తెలుగు బిగ్‌బాస్ సీజన్‌-5 ఇటీవ‌ల ముగిసింది. ఇందులో పాల్గొన్న ష‌ణ్ముఖ్ జ‌స్వంత్, సిరి హ‌న్మంత్‌లు పూర్తి నెగిటివిటీనీ మూట‌గ‌ట్టుకున్నారు. హౌస్‌లోకి వీరిద్ద‌రూ ప్ర‌వ‌ర్తించిన తీరు ప్రేక్ష‌కుల‌కు రోత పుట్టించిన‌ది.

Srihan: సిరి ప్రియుడికి బిగ్ బాస్ భారీ ఆఫర్.? నెట్టింట జోరుగా ప్రచారం.!

Advertisement

Advertisement

మ‌రొక‌వైపు ష‌ణ్ముఖ్‌, దీప్తిల ఐదేండ్ల ప్రేమ బంధం బిగ్‌బాస్ ముగిసిన వెంట‌నే ముగింపున‌కు రాగా.. సిరి-శ్రీ‌హ‌న్‌ల ల‌వ్ లైఫ్ బీటలు వారుతున్న‌ద‌ని టాక్. బిగ్‌బాస్ ముగిసే దాకా సిరికి మ‌ద్ద‌తుగా నిలిచిన ఆమె ప్రియుడు శ్రీ‌హ‌న్ ఇటీవ‌ల సిరితో క‌లిసి ఉన్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసాడు. కేవ‌లం వారిద్ద‌రూ క‌లిసి న‌టించిన వెబ్‌సిరీస్‌ల‌కు సంబంధించి ఫొటోల‌ను మాత్ర‌మే ఉంచాడు. దీంతో వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే బ్రేక‌ప్ చెప్పుకోనున్నారు వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం శ్రీ‌హ‌న్‌కు సంబంధించిన ఓ వార్త ఇంట‌ర్‌నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది.

Is Siri Hanmanth Boyfriend Shrihan In Bigg Boss OTT - Sakshi

వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ ఓటీటీలోకి శ్రీ‌హ‌న్‌ను తీసుకురావాల‌ని బిగ్‌బాస్ యూనిట్ ఆలోచిస్తుంద‌ట‌. ఈ మేర‌కు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు టాక్‌. అయితే ఈషోకి ఎంట్రి ఇచ్చేందుకు శ్రీ‌హ‌న్ విముఖ‌త చూపిస్తున్న‌ట్టు స‌న్నిహితుల మాట‌. మ‌రీ చివ‌రికీ ఏమి జ‌రుగుతుందో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి మ‌రీ.

Visitors Are Also Reading