Home » నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ సునీత!

నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ సునీత!

by Bunty
Ad

సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె గుంటూరులో పుట్టి పెరిగినప్పటికీ విజయవాడలో విద్యాభ్యాసం చేసింది. తోలుతా టీవీ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా , అసిస్టెంట్ దర్శకురాలుగా పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల వయసులో ఆమె చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది. తోలుతా ఆమెకు గులాబీ, ఎగిరే పావురమా మంచి పేరు తీసుకొచ్చాయి.

Advertisement

ఆ తర్వాత ఆ డబ్బింగ్ కళాకారునిగా రాణిస్తూనే చాలామంది తెలుగు హీరోయిన్లకు వాయిస్ అందించింది. దాదాపు 500 కి పైగా సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది సింగర్ సునీత. ఇక ఆమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త మ్యాంగో డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేని పెళ్లి చేసుకుంది. వీరి లేట్ వివాహం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉండగా, అయితే సింగర్స్ సునీతకు, బాలు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. మావయ్య అంటూ సునీత ఆయనను ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు.

Advertisement

ఎస్పీబీ మరణంతో సునీత ఎంతో మనోవేదనకు గురయ్యారు. తాజాగా మరోసారి ఆమె బాలసుబ్రమణ్యం గుర్తు చేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి బాలు గారిని పోగొట్టుకున్నాను. ఆ తర్వాత నాకు కన్నీళ్లు రావడం ఆగిపోయాయి అని అన్నారు సునీత. అంతకుమించి గుండెను పిండేసే సంఘటనలు ఇంకా ఏముంటాయి? అనిపించింది. అంతగా నన్ను ఇక ఏ సంఘటనలు కదిలించడం లేదు. ఆయన చూపించిన మార్గంలో నడవడమే ఆయనకి మనం ఇచ్చే గౌరవం, ఆయన జ్ఞాపకాలతో, గడిపేయడమే” అని అన్నారు సునీత.

read also : నర్సుల దెబ్బకు దిగివచ్చిన బాలయ్య.. సోషల్ మీడియాలో పోస్ట్ !

Visitors Are Also Reading