Telugu News » Blog » నర్సుల దెబ్బకు దిగివచ్చిన బాలయ్య.. సోషల్ మీడియాలో పోస్ట్ !

నర్సుల దెబ్బకు దిగివచ్చిన బాలయ్య.. సోషల్ మీడియాలో పోస్ట్ !

by Bunty
Ads

టాలీవుడ్ హీరో, టిడిపి ఎమ్యెల్యే  నందమూరి బాలయ్య, ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్నారు. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ఈ మధ్యనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమాతో కూడా మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో లో నర్సులను కించపరుస్తూ మాట్లాడారు.

Advertisement

దీంతో ఏపీవ్యాప్తంగా బాలయ్యకు వ్యతిరేకంగా ధర్నాలు మరియు నిరసనలు తెలిపారు నర్సులు. దీంతో చేసేదేమీ లేక ఈ వివాదంపై బాలయ్య స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు బాలయ్య. “అందరికీ నమస్కారం. నర్సులను కించపరిచాను అంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలని వక్రీకరించారు. రోగులకు సేవలు అందించే నా సోదరీమణులు అంటే నాకెంతో గౌరవం” అంటూ బాలయ్య పేర్కొన్నారు.

Advertisement

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సేవలు చేసి ప్రాణాలు నిలిపే నర్సులకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతో మంది నర్సులు రోగులకు ఎంతగానో సేవలు అందించారని గుర్తు చేశారు. బాలయ్య అలాంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి అని కోరారు. నిజంగా నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాలయ్య.

Advertisement

read also : ధావన్ కెరీర్ నాశనం చేస్తున్న మాజీ భార్య…వాటిని లీక్ చేస్తానంటూ బెదిరింపులు !