Home » నటిగా సినిమాల్లోకి సింగర్ సునీత….ఆ స్టార్ హీరోకు అక్కగా గోల్డెన్ ఛాన్స్…?

నటిగా సినిమాల్లోకి సింగర్ సునీత….ఆ స్టార్ హీరోకు అక్కగా గోల్డెన్ ఛాన్స్…?

by AJAY
Ad

టాలీవుడ్ లో సింగర్ సునీత అంటే పరిచయం అక్కర్లేని పేరు. వందల సూపర్ హిట్ పాటలను తన గొంతుతో పాడి సునీత ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా సైతం సునీత ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. పాటలతో ఆకట్టుకుంటేనే సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు.

sunita ram veerapaneni

Advertisement

సునీత ఇప్పటివరకు సినిమాలో నటించకపోయినా నటి రేంజ్ లో ఆమె ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే సునీత మ్యాంగో రామ్ ను వివాహం చేసుకుని గతేడాది వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. మరోవైపు సింగర్ గా కొనసాగుతూనే సునీత పాటల షో లకు జడ్జిగా వ్యవహరించిన సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు సునిత గురించి ఓ విషయం ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతోంది.

Advertisement

Sunita ram

Sunita ram

త్వరలో సునీత వెండి తెరపై కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో నటించే ఛాన్స్ సునీతకు దక్కినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు త్రివిక్రమ్ సునీతను సంప్రదించారట. ఆ రోల్ మహేష్ బాబు అక్క పాత్ర అని సమాచారం.

singer sunitha son akash

అయితే కథ మరియు సినిమాలో పాత్ర తనకు నచ్చడంతో సునీత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి గతంలో కూడా సునిత కు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె రిజెక్ట్ చేశారు. అయితే ఈసారి మాత్రం సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సునీత నోరు విప్పాల్సిందే.

Visitors Are Also Reading