Telugu News » Lata Mangeshkar : గానకోకిలకు ప‌లువురు సెలబ్రెటీల నివాళి

Lata Mangeshkar : గానకోకిలకు ప‌లువురు సెలబ్రెటీల నివాళి

by Anji

ప్ర‌ముఖ గాయ‌ని భార‌త‌ర‌త్న పుర‌స్కార గ్ర‌హీత గాన‌కోకిల ల‌తా మంగేష్క‌ర్ ఇవాళ ఉద‌యం 8గంట‌ల 12 నిమిషాల‌కు మృతి చెందారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో ఐసీయూలో ఊపిరితిత్తుల ఇన్పెక్ష‌న్ కు సంబంధించి చికిత్స పొందుతున్నారు. 29 రోజుల నుంచి ఆమె ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నా.. ఆరోగ్యం మెరుగుప‌డ‌లేదు. ఆమె వ‌య‌స్సు 92 ఏళ్లు కావ‌డంతో ఆమెను ఐసీయూలోనే ఉంచి ప‌ర్య‌వేక్షించారు వైద్యులు. దాదాపు 28 రోజుల పాటు ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నా శ‌నివారం నుంచి ఆరోగ్యం మ‌రింత‌గా క్షీణించింది. మ‌ల్టీ ఆర్గాన్స్ కూడా దెబ్బ‌తిన్నాయి.

Ads

ల‌తా మంగేష్క‌ర్ మృతి చెందార‌నే వార్త తెలియ‌గానే బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్ ఇలా దేశ‌వ్యాప్తంగా ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ ప్ర‌ముఖులు ఆమెకు సంతాపం తెలిపారు. తొలుత భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సంతాపం ప్ర‌క‌టించారు. అదేవిధంగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు, వై.ఎస్. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ ఇలా పలువురు సంతాపాన్ని ప్ర‌క‌టించారు.

అదేవిధంగా ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ మృతి ప‌ట్ల రెండు రోజులు జాతీయ సంతాప దినాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కూడా రెండు రోజుల‌ను సంతాప దినాలు ప్ర‌క‌టించింది. అదేవిధంగా ఇవాళ సాయంత్రం 6.30 గంట‌ల‌కు ముంబైలోని శివాజీ పార్కులో ల‌తా మంగేష్క‌ర్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.


You may also like