Home » సంగీత దర్శకుడు థమన్ గురించి సింగర్ గీతా మాధురి ఏమందో తెలుసా ?

సంగీత దర్శకుడు థమన్ గురించి సింగర్ గీతా మాధురి ఏమందో తెలుసా ?

by Anji
Ad

సంగీత దర్శకుడు థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం టాప్ సంగీత దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. థమన్ సంగీత దర్శకుడు కాకముందు తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బాయ్స్ చిత్రంలో సైడ్ యాక్టర్ గా నటించాడు థమన్. సంగీత దర్శకుడిగా తొలిచిత్ర మాస్ మహారాజా రవితేజ-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన కిక్. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంలో థమన్ మ్యూజిక్ కూడా తోడు కావడంతో అప్పటి నుంచి వరుస అవకాశాలను దక్కించుకొని మంచి ఫామ్ లో ఉన్నారు థమన్.  

Also Read :  నరేష్ “మళ్లీ పెళ్లి” చిత్రంలో.. కృష్ణ, విజయనిర్మల కూడా ఉన్నారని తెలుసా..?

Advertisement

ప్రస్తుతం డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో థమన్ ఒకరు. అగ్ర నిర్మాతలకు ఫస్ట్ చాయిస్ మారారు. మంచి మ్యూజిషియన్ గా కాకుండా మంచి మనసు ఉన్న వ్యక్తిగా కూడా నిరూపించుకున్నారు థమన్.  ఇక ఈ విషయాన్ని సింగర్ గీతా మాధురి ఇటీవలే వెల్లడించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ మ్యూజిషియన్ కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సహాయం చేశారు థమన్. ఆహా, ఓటీటీలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో గాయని గీతా మాధురి ఈ విషయాన్ని వెల్లడించారు. థమన్ గురించి ఎవ్వరికీ తెలియని విషయం చెప్పాలనుకుంటోందంటూ.. ఆ వివరాలను వెల్లడించింది. 

Also Read :  Video viral:18 ఏళ్ల యువతితో,50 ఏళ్ల అంకుల్.. సందులో ఎవరూ లేరనుకోని రెచ్చిపోయారు..ఇంతలో..!!

Advertisement

ఓ మ్యూజిషయన్ కి క్యాన్సర్ రావడంతో వారి కుటుంబ సభ్యులు కీమో ట్రీట్ మెంట్ చేయించారు. ఆ ట్రీట్మెంట్ వల్ల ఆ మ్యూజిషియన్ బాడీ మొత్తం కాలిపోయిందట. దీంతో అతన్ని హాస్పిటల్ నుంచి తీసుకెళ్లిపోదాం అని అనుకుంటే.. హాస్పిటల్ వారు డబ్బు కడితే గానీ కనిపించామన్నారు. ఈ విషయం తెలుసుకున్న థమన్ వెంటనే రూ.10లక్షలు ఇచ్చినట్టు గీతామాధురి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. థమన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. వేడుకలు, కార్యక్రమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్ ను స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తానని థమన్ చెప్పాడు. గుంటూరులో 100 మందితో వృద్ధాశ్రమం నిర్మిస్తున్నామని.. వీలు అయినంత త్వరగా ప్రారభిస్తామని తెలిపారు థమన్. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, మహేష్ బాబు, #SSMB, పవన్ కళ్యాణ్, ఓజీతో పాటు మరికొన్ని సినిమాలతో దూసుకెళ్తున్నాడు.  

Also Read :   మోహన్ బాబు నాతో అలా ఉంటాడంటూ ఎమోషనల్ అయినా కొత్త కోడలు మౌనిక.. ఏం జరిగిందంటే..?

Visitors Are Also Reading