Home » నరేష్ “మళ్లీ పెళ్లి” చిత్రంలో.. కృష్ణ, విజయనిర్మల కూడా ఉన్నారని తెలుసా..?

నరేష్ “మళ్లీ పెళ్లి” చిత్రంలో.. కృష్ణ, విజయనిర్మల కూడా ఉన్నారని తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నరేష్ పవిత్ర లోకేష్ గురించే అనేక వార్తలు వినిపించాయి. వీరి ప్రేమ వ్యవహారం గురించి వార్తల్లో రచ్చ రచ్చ జరిగింది. మూడో భార్య రమ్య రఘుపతి ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా నరేష్ పవిత్ర లోకేష్ తో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పరువు తీసేసింది. దీంతో నరేష్ ఆమెకు ఎలాగైనా విడాకులు ఇచ్చి పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా వీరు వారి పెళ్లికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు.

Advertisement

Also Read:నాకు అదే చివరి మ్యాచ్… రిటైర్మెంట్ పై ధోని సంచలన ప్రకటన

Advertisement

ఈ మధ్యకాలంలో పెళ్లి జరిగిందంటూ ఒక వార్త సంచలనంగా మారింది. కానీ చివరికి అందరినీ పప్పులో కాలు వేయించి అదంతా మళ్లీ పెళ్లి అనే సినిమా షూటింగ్లో భాగమని తెలిసింది. ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వస్తున్న మళ్లీ పెళ్లి టీజర్ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో మనందరికీ తెలుసు. ఇక ఈ టీజర్ లో అందరి చూపు ఒకచోట ఆగిపోతుంది. అదే కృష్ణ విజయనిర్మల . విజయనిర్మలకు ఒక్కగానొక్క కొడుకు నరేష్ అని అందరికీ తెలుసు. కృష్ణ విజయనిర్మల జీవించి ఉన్నప్పుడే వీరి ప్రేమ వ్యవహారం వారికి తెలుసు.

Also Read:DK లాగే… భార్య చేతిలో మోసపోయిన బాధితులు వీళ్లే…!

ముఖ్యంగా విజయనిర్మలకు వీరి పరిచయం 2018లో జరగగా, 2019లో ఆమె కన్నుమూశారు. ఇక ఈ ఏడాదిలో నరేష్ పవిత్ర ని ఇంటికి కూడా తీసుకెళ్లాడట. టీజర్ లో ఆ ఇన్సిడెంట్ కూడా పొందపరిచారు. ఇక ఈ చిత్రంలో కృష్ణగా శరత్ బాబు, విజయనిర్మల పాత్రలో జయసుధ నటించి ఉంటారని టీజర్ చూసిన కొంతమంది నెటిజెన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read:Maama Mascheendra : దుమ్ము లేపుతున్న ‘మామా మశ్చీంద్ర’ టీజర్

Visitors Are Also Reading