Home » వామ్మో కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..?

వామ్మో కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..?

by Bunty
Ad

కొంతమంది నటీనటులు ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. వారు ఎంత స్పీడుగా ఎదుగుతారో అంతే స్పీడుగా కనుమరుగై పోతూ ఉంటారు. అలాంటి కోవకే చెందింది ఈ అందాల భామ శ్వేతా బసు ప్రసాద్.  కొత్త బంగారులోకం సినిమాతో కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ హీరోయిన్ ఒక్క సినిమాతోనే టాప్ లెవల్ హీరోయిన్ గా మారిపోయింది.

swetha-basu-prasad Latest

Advertisement

 

ఈ సినిమా ఆమె కెరియర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. అలాంటి హీరోయిన్ జీవితంలో కొన్ని అనివార్య ఘటనల వల్ల కెరియర్ మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆఫర్లు ఏవి రాకపోవడంతో సతమతమైంది. చివరికి దర్శకుడు రోహిత్ ను వివాహం చేసుకొని ఏడాది కాకుండానే మళ్లీ విడాకులు తీసుకుంది. అలాంటి హీరోయిన్ సినిమా ఆఫర్ల కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. మంచి పాత్రలు దొరికితే చేస్తానని అంటుంది.

Advertisement

అలాంటి శ్వేత బసు ప్రసాద్ కొత్త బంగారులోకం సినిమాలో ఎంత క్యూట్ గా ఉందో మనందరికీ తెలుసు. ఆ సినిమాలో బోద్దుగా, చూడ చక్కని అమ్మాయిలా తన నటనతో అందరిని ఆకట్టుకుంది. అలాంటి ఈ అమ్మడు ప్రస్తుతం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నది. చాలా సన్నగా మారింది. సినిమా అవకాశాల కోసం గట్టిగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కొత్త బంగారులోకం సినిమా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆఫర్ల కోసం ఇంత కష్టపడి సన్నగా మారిన శ్వేతా బసు ప్రసాద్ కు మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.

READ ALSO : అట్లుంటది మనతోని..NTR ను కలిసిన టీమిండియా..ఫోటోలు వైరల్

Visitors Are Also Reading