Home » ఎన్ని ఏళ్ళు అయిన అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను..!

ఎన్ని ఏళ్ళు అయిన అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను..!

by Azhar
Ad
టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త దర్శకుల ఎంట్రీ అనేది ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. అయితే యువ దర్శకులు అందరూ తాము ఈ టాప్ హీరోతో సినిమా చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇప్పుడు అలాగే ఓ యువ దర్శకుడు నేను ఎన్ని రోజులు అయిన అల్లు అర్జున్ తో సినిమా తీసే తీరుతాను అని అంటున్నారు.
అయితే ఈ మధ్యే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. అలాంటి స్టార్ తో సినిమా చేస్తాను అంటున్న డైరెక్టర్ శ్రీ కార్తీక్. ఈయన తాజాగా తీసిన సినిమా ఓకే ఒక జీవితం. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమా అనేది తాజాగా విడుదలై హిట్ అందుకుంది. దాంతో డైరెక్టర్ కార్తీక్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ కోసం తాను ఓ కథను సిద్ధం చేసినట్లు చెప్పాడు. ఈ కథను కేవలం బన్నీ కోసమే చేశాను అని.. ఈ సినిమాను ఆయనతో తీయడానికి ఒక్క ఏడాది కాదు.. 5 ఏళ్ళు అంతకంటే ఎక్కువ అయిన మంచిదే నేను ఆడుతాను అని అన్నాడు. అయితే ఈ సినిమా అనేది రియలిజం ఫాంటసీ నేపథ్యంలో ఉంటుంది అని చెప్పాడు. ఈయన ఇంత గట్టిగా చెబుతున్నారు కాబట్టి.. భవిష్యత్ లో శ్రీ కార్తీక్.. అల్లు అర్జున్ సినిమా ఉంటుంది అని అనుకోవడంలో తప్పు లేదు.

Advertisement

Visitors Are Also Reading