Home » కృష్ణా ముకుందా మురారి సీరియల్ నటి కృష్ణ రియల్ లైఫ్ గురించి షాకింగ్ నిజాలు..!!

కృష్ణా ముకుందా మురారి సీరియల్ నటి కృష్ణ రియల్ లైఫ్ గురించి షాకింగ్ నిజాలు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు స్టార్ మా లో అనేక సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ సీరియల్ టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది కృష్ణ ముకుందా మురారి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సీరియల్ గురించే చర్చ జరుగుతోంది. నవంబర్ 14న ప్రారంభమైన ఈ సీరియల్ వచ్చిన కొన్ని నెలల్లోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది. ఇందులో నటీనటులు కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. మరి సీరియల్ లో నటించే కృష్ణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

Advertisement

Also Read:“దాస్ కా దమ్కి”కి దమ్కి ఇచ్చిన బలగం.. ఓటిపి రిలీజ్ ఎప్పుడంటే..?

కృష్ణ ముకుందా మురారి సీరియల్ ఒక బెంగాలీ సీరియల్ కు రిమేక్ గా వస్తుంది. ఈ సీరియల్లో కృష్ణ క్యారెక్టర్ ద్వారా ఒక కొత్త నటి తెలుగు బుల్లితెర లోకి ప్రవేశించింది. అలాంటి కృష్ణకు ఇప్పటికే ఎంతో మంది అభిమానులు తయారయ్యారు. మరి అలాంటి కృష్ణ నిజ జీవితం గురించి కొన్ని విషయాలు చూద్దాం.. కృష్ణ అసలు పేరు ప్రేరణ కంభం.. 1996 లో హైదరాబాదులో జన్మించింది. కానీ పెరిగిందంతా చెన్నైలోనే.. దయానంద్ కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చదువు పూర్తవగానే మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

Also Read:శ్రీరామనవమి రోజున మధ్యాహ్న సమయంలోనే పూజ ఎందుకు చేయాలో తెలుసా..?

ఆ తర్వాత కన్నడ సీరియల్ ల ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టింది.అక్కడ సినిమాల్లో కూడా చేసింది. కన్నడ సీరియల్లో రంగనాయకి పాత్ర ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. ఇక ఆమె నటించిన ఫిజిక్స్ టీచర్ సినిమా నటిగా మరింత గుర్తింపుని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఇక ప్రేరణ టైమ్ దొరికితే చాలు ఫ్రెండ్స్,ఫ్యామిలీతో కలిసి కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటుందట. ప్రేరణకు తెలుగులో కృష్ణ ముకుంద మురారి మొట్టమొదటి సీరియల్. ఈ సీరియల్లో ఆమె క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతోంది. మంచి గుర్తింపు లభిస్తోందని చెప్పవచ్చు..

Also Read:ఆస్కార్ కు పంపాల‌నుకున్న ఈ ఇండియ‌న్ సినిమా స్టోరీ తెలిస్తే మ‌తిపోవాల్సిందే..ఆ ఒక్క సీన్ చూస్తే చాలు!

Visitors Are Also Reading