Home » “దాస్ కా దమ్కి”కి దమ్కి ఇచ్చిన బలగం.. ఓటిపి రిలీజ్ ఎప్పుడంటే..?

“దాస్ కా దమ్కి”కి దమ్కి ఇచ్చిన బలగం.. ఓటిపి రిలీజ్ ఎప్పుడంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది యంగ్ హీరోలు వారి టాలెంట్ ను బయట పెట్టుకుంటూ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్. తాజాగా దాస్ కా దమ్ కి సినిమాతో హీరోగా మరియు డైరెక్టర్ గా తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. సినిమా ఇప్పటికే థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.. మిశ్రమ స్పందనతో ముందుకు వెళుతుంది. సినిమా రిలీజ్ కి ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసిన విశ్వక్సేన్.. మొదటిరోజు మాత్రం అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది. అలా పాజిటివ్ టాక్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న మూవీ కాస్త దూకుడు తగ్గింది అని చెప్పవచ్చు..

Advertisement

Also Read:శ్రీరామనవమి రోజున మధ్యాహ్న సమయంలోనే పూజ ఎందుకు చేయాలో తెలుసా..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూపాయలు 6.80కోట్ల బిజినెస్ చేసింది. ఇండియా ఓవర్సీస్ లో రూపాయలు 70 లక్షలు వసూలు చేసింది, ఇక వరల్డ్ వైడ్ గా రూపాయలు7.50 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక మొదటి రోజు రూపాయలు 8 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది. తర్వాత రెండు మూడు రోజుల్లో కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ దాస్ కా దమ్ కి ఒకే సమయంలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక రంగమార్తాండ మంచి ఆదరణ లభించినప్పటికీ దాస్ కా దమ్ కి మూవీ మాత్రం కలెక్షన్స్ రాబట్టింది.

Advertisement

Also Read:“ఆస్కార్” స్టేజ్ పై స్టెప్పులు వేయాల‌ని చ‌ర‌ణ్ అనుకుంటే ఎన్టీఆర్ ఎందుకు నో చెప్పారు..! లీక్ అయిన అస‌లు మ్యాట‌ర్..!

ఇదంతా పక్కన పెడితే కమెడియన్ వేణు డైరెక్షన్ చేసిన బలగం మూవీ ప్రస్తుతం థియేటర్లలో జోష్ కొనసాగిస్తూ వస్తోంది. ఈ రెండు సినిమాలతో పోలిస్తే మాత్రం బలగం మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని వారాలైనా ఇంకా దూసుకుపోతుందని చెప్పవచ్చు. బలగం దెబ్బకు దాస్ కా దమ్ కి చతికిల పడింది. ఇక సోమవారం రోజున బలగం కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ మూవీ ఓటిటిలోకి ఏప్రిల్ రెండవ వారంలో లేదంటే మూడో వారంలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రం ఓటిటి రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. డీల్ ప్రకారమైతే ఓటిటిలో సినిమా మేలో రావాలి. కానీ కలెక్షన్స్ తగ్గుతూ ఉండటంతో సినిమా అనుకున్న డీల్ కంటే తొందరగా ఓటీటి లోకి రావచ్చని టాక్ వినిపిస్తోంది .

Also Read:నైట్ పార్టీల‌కు విరాట్ అనుష్క‌లు ఎందుకు దూరంగా ఉంటారో తెలుసా..?

Visitors Are Also Reading