Home » త‌న‌ను దారుణంగా అమానించిన న‌టుడికే పిలిచి సాయం చేసిన శోభ‌న్ బాబు…! ఆ న‌టుడు ఎవ‌రంటే..?

త‌న‌ను దారుణంగా అమానించిన న‌టుడికే పిలిచి సాయం చేసిన శోభ‌న్ బాబు…! ఆ న‌టుడు ఎవ‌రంటే..?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అంత సులువైన విషయం కాదు. ముందుగా సినిమాల్లో అవకాశాలు రావాలంటేనే స్టూడియోల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలి… కడుపు మాడ్చుకుని అవకాశాల కోసం ఎదురు చూడాలి. సినిమా ఇండస్ట్రీలో రాణించిన వారిలో అలా ఎంతో కష్టపడ్డ వాళ్లే చాలామంది ఉన్నారు. సోగ్గాడు శోభన్ బాబు కూడా అలా కష్టపడిన వారే. సినిమాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్ వెళ్లిన శోభన్ బాబు అక్కడ ఒక డొక్కు సైకిల్ కొనుక్కొని అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవారు.

Advertisement

అప్పటికే శోభన్ బాబు పెళ్లి చేసుకోగా… ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు. దాంతో వారిని అద్దె గదిలో ఉంచి ఆయన సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు. సినిమాల్లో ఏ చిన్న పాత్ర ఇచ్చినా కూడా కాదు అనకుండా నటించేవారు. ఈ క్రమంలో ఆయన రాజనాల విలన్ పాత్రలో నటిస్తున్న ఓ సినిమాలో చిన్న అవకాశాన్ని అందుకున్నారు. అది పెద్ద సినిమా కావడంతో ఆ సినిమాలో చాన్స్ వ‌చ్చినందుకు శోభన్ బాబు చాలా ఆనందపడ్డారు.

shoban babu rejected athadu movie

అయితే ఆ సమయంలో రాజనాల ప్రముఖ నటుడుగా గుర్తింపు సాధించుకున్నారు. ఇండస్ట్రీలో ఆయన బిజీగా ఉండేవారు. దాంతో ఆయన కు ఎంతో గౌరవం ఇవ్వడంతో పాటు ఆయన మాట్లాడితేనే భయపడేవాళ్ళు కూడా. ఇక రాజ‌నాల సీనియర్ నటుడు కావడంతో ఆయనతో నటించేందుకు శోభన్ బాబు మొదటగా భయపడ్డారు. దాంతో సరిగ్గా నటించలేక తడపడ్డారు.

Advertisement

rajanala

rajanala

అనేకసార్లు రీటేక్స్ తీసుకోవడంతో రాజనాల శోభన్ బాబు పై సీరియస్ అయ్యాడు. ఎవరయ్యా ఇతను… ఎక్కడ నుండి తీసుకువచ్చారు..? నటన రాదు పాడు రాదు. నేను ఈ సన్నివేశంలో నటించను.. ఏం చేసుకుంటారో చేసుకోండి. అంటూ చిత్ర బృందాన్ని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాంతో శోభన్ బాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయినప్పటికీ కుటుంబ పోషణ కోసం ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ చిత్ర బృందాన్ని వేడుకున్నారు. కానీ రాజనాలకు భయపడి చిత్ర యూనిట్ దానికి ఒప్పుకోలేదు. దాంతో శోభన్ బాబు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ శోభ‌న్ బాబు హీరోగా వ‌ర‌కూ ఎదిగారు. అంతే కాకుండా స్టార్ హీరోగా రానిస్తూ కోట్లు సంపాదించారు. ఈ క్రమంలో రాజనాల మత్తుపదార్థాలకు బానిసై కెరీర్ ను నాశనం చేసుకున్నారు. అయిన వాళ్ళు కూడా రాజనాలను దూరం పెట్టారు. ఇక అవకాశాలు లేక చివరకు రాజ‌నాల‌ ఓ రోజు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో శోభన్ బాబు కంటపడ్డారు. ఆయనను చూసి శోభన్ బాబు వెంటనే కారు ఆపి ఎక్కించుకున్నారు. అంతేకాకుండా ఇంటికి తీసుకువెళ్లి 25 వేల రూపాయలను ఆయన చేతిలో పెట్టారు. ఆ సమయంలో రాజనాల తాను చేసిన పనిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

ALSO READ: పవన్ కళ్యాణ్ చెప్పిన వినలేదు ! గుడుంబా శంకర్ అందుకే ఫ్లాప్ అయ్యిందట..!

Visitors Are Also Reading