Home » పవన్ కళ్యాణ్ చెప్పిన వినలేదు ! గుడుంబా శంకర్ అందుకే ఫ్లాప్ అయ్యిందట..!

పవన్ కళ్యాణ్ చెప్పిన వినలేదు ! గుడుంబా శంకర్ అందుకే ఫ్లాప్ అయ్యిందట..!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉన్నాయి. అదేవిధంగా వ‌ప‌న్ క‌ల్యాణ్ కెరీర్ లో ఫ్లాప్ లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ప‌వ‌న్ కెరీర్ లోని ఫ్లాప్ సినిమాల‌లో గుడుంబా శంక‌ర్ సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపించారు. రెండు ప్యాంటులు వేసుకుని ప‌వ‌న్ త‌న స్టైల్ తో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇక ఈ సినిమాను అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు నిర్మించారు. ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చి ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

Advertisement

ఈ సినిమాకు వీర‌శంకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. సినిమాలో హీరోయిన్ గా మీరా జాస్మీన్ న‌టించి ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమా ద‌ర్శ‌కుడు వీర‌శంక‌ర్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. తన‌కు హీరో శ్రీకాంత్ క్లాస్ మేట్ అని చెప్పారు. శ్రీకాంత్ తో సినిమా చేయాల‌నే తాను ద‌ర్శ‌కుడిని అయ్యానని చెప్పారు.

Advertisement

gudumba shankar

శ్రీకాంత్ మ‌రియు కేఎస్ రామారావు త‌న‌ను ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టార‌ని అన్నారు. ఇక 2004లో కుషి సినిమా త‌రవాత ద‌ర్శ‌కులు అంతా ప‌వ‌న్ చుట్టూ సినిమాల కోసం తిరిగార‌ని అన్నారు. అలాంటి స‌మ‌యంలో త‌న‌కు గుడుంబా శంక‌ర్ తీసే ఛాన్స్ వ‌చ్చింద‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌తో సినిమా చేస్తాన‌ని మొద‌ట చెప్పార‌ని అన్నారు. ఆ లోపే జానీ కూడా సినిమా కూడా విడుద‌లై ఫ్లాప్ అయ్యిందని చెప్పారు.

దాంతో అప్ప‌టి వ‌ర‌కూ అనుకున్న క‌థ‌ను ప‌క్క‌న పెట్టి గుడుంబా శంక‌ర్ అనే కామెడీ ఎంట‌ర్టైన‌ర్ ను ప్లాన్ చేశామ‌ని చెప్పారు. ఇక సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో తాను క్లైమాక్స్ లో యాక్ష‌న్ బ్లాక్ ను ప్లాన్ చేశాన‌ని వీరశంక‌ర్ అన్నారు. కానీ ప‌వ‌న్ క్లైమాక్స్ నాచుర‌ల్ గా తీయాల‌ని చెప్పార‌ని అన్నాడు. దాంతో అలానే తీసి థ‌ర్డ్ ప‌ర్సన్ కు చూపిస్తే వాళ్లు కూడా బాగుంద‌ని చెప్పార‌ని అన్నారు. కానీ సినిమా జనాల్లోకి వెళ్లిన త‌ర‌వాత వాళ్ల‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పాడు.

Visitors Are Also Reading