Telugu News » Blog » Sudhakar : నేను ఇంకా చనిపోలేదు… బతికే ఉన్నాను

Sudhakar : నేను ఇంకా చనిపోలేదు… బతికే ఉన్నాను

by Bunty
Ads

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. 2020 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ప్రముఖులను కోల్పోయింది. అయితే తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజు మరణ వార్త మరువక ముందే… సీనియర్ నటుడు శరత్ బాబు మరణించారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో మొన్న జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే సీనియర్ నటుడు శరత్ బాబు మరణించిన రోజు నుంచి ఇప్పటివరకు వార్త వైరల్ గా మారింది. సీనియర్ నటుడు సుధాకర్ మరణించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టరు వైరల్ గా మారింది. ఆయనపై ఎప్పుడు ఇలాంటి వార్తలు రాలేదు. ఏకంగా ఆయన చనిపోయారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే నిన్నటి వరకు జరిగిన ప్రచారంపై స్వయంగా స్టార్ కమెడియన్ సుధాకర్ స్పందించారు.

Advertisement

ఈ సందర్భంగా కమెడియన్ సుధాకర్ మాట్లాడుతూ… నా మీద వచ్చినవన్నీ అసత్య ప్రచారాలేనని ఆయన వెల్లడించారు. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి అని… అలాంటివి ప్రచారం చేయకూడదని ఆయన సూచించారు. నేను చాలా సంతోషంగా ఉన్నానంటూ సుధాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు కమెడియన్ సుధాకర్. కాగా 1980, 90 కాలాల్లో సుధాకర్ కమెడియన్ గా రాణించారు. అయితే 2010లో అనారోగ్యంతో కోమాలోకి వెళ్లారు కమెడియన్ సుధాకర్. ఇక ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

సంతానం లేదు… మరీ శరత్‌ బాబు కోట్ల ఆస్తులకు వారసులు ఎవరు..!

Gangavva : చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు… తప్పుగా అనుకోవద్దు సార్…

Advertisement

IPL 2023 : ముంబైని గెలిపించిన ఆకాశ్ మద్వాల్ కు పంత్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

You may also like