Home » పెళ్లి కొడుకు గెటప్ లో షమీ.. సోషల్ మీడియాలో వైరల్..!

పెళ్లి కొడుకు గెటప్ లో షమీ.. సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనిపరిచాడు. అయితే ప్రస్తుతం షమీ మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ తరువాత షమీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ తో పాటు దక్షిణాప్రికా పర్యటనకు షమీ దూరమయ్యాడు. స్వదేశంలో ఇంగ్లండ్ తో  టెస్ట్ సిరీస్ కి ప్రకటించిన జట్టులో షమీకి చోటు దక్కలేదు. షమీ త్వరలోనే సర్జరీ కోసం జర్మనీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే.. షమీ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి కొడుకు డ్రెస్ లో కనిపిస్తున్నాడు. తలపాగా ధరించి మెడలో దండతో ఉన్నటువంటి మూడు ఫోటోలను షమీ ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశాడు. ఫొటోలు చూసిన అభిమానులు ఏంటి షమీ సార్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షమీ తన భార్య హసీన్ జహాన్ తో ప్రస్తుతం దూరంగా ఉంటున్నాడు. షమీ తనతో క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని..  గృహహింస తో సహా పలు ఆరోపణలు చేసింది. ఈ తరుణంలో వారిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి విడాకులకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ తరుణంలో షమీ పెళ్లి కొడుకు లుక్ లో కనిపించడం చూసి అందరూ ఆశ్చర్యపోవడం విశేషం. 

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading