Home » UPASANA:ఉపాసన ఇంట్లో తీవ్ర విషాదం..పెద్దదిక్కు కోల్పోయిందా..?

UPASANA:ఉపాసన ఇంట్లో తీవ్ర విషాదం..పెద్దదిక్కు కోల్పోయిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మెగా వారి కోడలు ఉపాసన ఇంట్లో తీవ్రమైన విషాదం నెలకొంది. ఆమె నానమ్మ అనారోగ్యం కారణంగా కన్ను మూసింది. ఈ విషాద ఘటనను ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేసింది. మా ఇంటి పెద్ద దిక్కు అయినా మా నానమ్మను కోల్పోవడం చాలా బాధగా ఉందని తెలియజేసింది.

Advertisement

 

ఆమె చివరి వరకు ఎంతో సానుభూతి, గౌరవం,కృతజ్ఞతా,ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారని అన్నది. నేను జీవితంలో ఎలా బ్రతకాలో ఆమె ద్వారానే తెలుసుకున్నానని, ఆమె నన్ను పెంచి పెద్ద చేసిందని, తన ప్రేమను ఎప్పటికీ కూడా మర్చిపోలేనని ఎమోషనల్ అయింది. నేను నానమ్మ నుంచి ఏ విధమైన ప్రేమానురాగాలు పొందానో ఆ ప్రేమానురాగాలు, అనుభూతులన్ని నా పిల్లలకి అందేలా చూస్తానని మాటిస్తున్నాను..

నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఉపాసన ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేసింది.. త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసన జీవితంలో తన ఆనందాన్ని నానమ్మతో పంచుకోవాలనుకున్నా అది తీరని కోరికగా మారిందని నెటిజన్ లు కామెంట్లు పెడుతున్నారు.

ALSO READ:ప్రేమిస్తే సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

Visitors Are Also Reading