మొదటి నుండి సినిమాలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉండేదో సీరియల్స్ కు కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంది. ముఖ్యంగా మహిళలు సీరియల్స్ ను మిస్ కాకుండా చూస్తుంటారు. తమ అభిమాన సీరియల్ వచ్చే సమయంలో ఎంత పెద్ద పని ఉన్నా దానిని పక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఒకప్పుడు సినిమా వాళ్లకే ఎక్కువ రెమ్యునరేష్ లు ఉండేవి. సినిమాలనే అధిక బడ్జెట్ తో తెరకెక్కించేవారు.
Advertisement
ALSO READ : నీ గుండెల్లోని బాధ ఎవ్వరికీ అర్థం కాలేదు…తారకరత్న భార్య ఎమోషనల్ కామెంట్స్..!
కానీ ఇప్పుడు సీరియల్స్ ను కూడా అదే రేంజ్ లో నిర్మిస్తున్నారు. అంతే కాకుండా సీరియల్ నటీమణులకు కూడా రెమ్యునరేషన్ లు గట్టిగానే ఇస్తున్నారు. అలా బుల్లితెరపై సంపాదిస్తున్న నటీమణులు ఎవరు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు అనే వివరాలు చూద్దాం..రీసెంగ్ వచ్చిన సీరియల్స్ లో ఎక్కువమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న సీరియల్ కార్తీకద్వీపం..
Advertisement
ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన ప్రేమివిశ్వనాథ్ ఒక్క కాల్ షీట్ కు రూ.30 వేల రెమ్యునరేషన్ పుచ్చుకున్నారు. ఈమెతో పాటూ సీరియల్స్ లో నటిస్తున్న నవ్యస్వామి, కస్తూరి, మేఘన లోకేష్, సుజిత లు కూడా 30వేల రెమ్యునేషన్ పుచ్చుకుంటున్నారు.
అదే విధంగా ఇప్పుడిప్పుడే సీరియల్స్ ద్వారా అభిమానులను సంపాదించుకుంటున్న శోభాశెట్టి, అనిలా శ్రీకుమార్, అర్చన అనంత్ లు ఒక్క కాల్ షీట్ కు రూ.15 వేల రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.
అంతే కాకుండా ఒకప్పుడు రాశి స్టార్ హీరోయిన్ గా రానించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సీరియల్స్ లో నటిస్తోంది. ఓ సీరియల్ లో తల్లి పాత్రలో నటిస్తున్న రాశి ఆ సీరియల్ కోసం ఒక్క కాల్ షీట్ కు రూ.40 వేల రెమ్యునరేషన్ ను అందుకుంటున్నట్టు తెలుస్తోంది.
Advertisement
ALSO READ : అలేఖ్య రెడ్డి తండ్రి ఎవరు.. అతను ఏం చేస్తాడో తెలుసా?