నందమూరి తారకరత్న ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. తారకరత్నని పెళ్లి చేసుకోక ముందు క్యాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన అలేఖ్యరెడ్డి పెళ్లి చేసుకున్న తరువాత ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది. అలేఖ్య రెడ్డికి తారకరత్న కంటే ముందే పెళ్లి జరగడం.. అతనితో వివాదాలు తలెత్తి విడాకులు ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి. ఇక ఆ తరువాత తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది అలేఖ్య. ఈ పెళ్లితో తారకరత్న కుటుంబ సభ్యులు కూడా వీరికి దూరమయ్యారు.
Advertisement
Also Read : నీ గుండెల్లోని బాధ ఎవ్వరికీ అర్థం కాలేదు…తారకరత్న భార్య ఎమోషనల్ కామెంట్స్..!
ముఖ్యంగా కులం వేరు.. మళ్లీ అప్పటికే పెళ్లి జరిగి విడాకులు తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో పరువు మర్యాదల గురించి ఆలోచించిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ తారకరత్న కుటుంబాన్ని దాదాపు పదేళ్లుగా దూరం పెట్టేశారు. ఇటీవలే ఫిబ్రవరి 18న తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, ముగ్గురు పిల్లలు ఒంటరివారయ్యారు. ఈ నేపథ్యంలోనే అలేఖ్య రెడ్డికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Also Read : బిగ్ బాస్ బ్యూటీ హిమజ జీవితంలో ఇన్ని కష్టాలు అనుభవించిందా..?
భర్త మరణించిన తరువాత విగత జీవిగా మారిన అలేఖ్య రెడ్డిని చూసిన ప్రతి ఒక్కరి గుండె చలించిపోతుంది. ఆమెకు అండగా నిలవాల్సిన ఫ్యామిలీ ఎక్కడ ఉంది. ఆమె నాన్న ఎవరు..? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అలేఖ్య రెడ్డి వైసీపీలో కొనసాగుతున్న విజయసాయిరెడ్డి భార్య సొంత చెల్లెలు కూతురే. అలేఖ్య రెడ్డి స్వస్థలం అనంతపురం. ఈమె తండ్రి పేరు మధుసూదన్ రెడ్డి. ఆయన ఆర్డీఓగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. వీరి ఫ్యామిలీ అనంతపురం నుంచి హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయింది. హైదరాబాద్ కి వచ్చిన తరువాత అలేఖ్య రెడ్డి కాస్టూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డి తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. ఆ తరువాత ఈమెను ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు తారకరత్న.
Advertisement
Also Read : మెగాస్టార్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఛాన్స్ మిస్ చేసుకుందా..! అసలు ఏం జరిగింది?